News November 19, 2024

పౌరసత్వాన్ని వదులుకొని..!

image

మెరుగైన అవకాశాలు, సౌకర్యాల కోసం ఏటా చాలా మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకొని ఇతర దేశాలకు పయనమవుతున్నారు. అయితే, వారు వెళ్లిపోవడానికి కొన్ని ముఖ్య కారణాలున్నాయి. అవేంటంటే.. స్వచ్ఛమైన గాలి & నీరు, నాణ్యమైన ప్రభుత్వ విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు, హైక్లాస్ ప్రజా రవాణా అని నిపుణులు చెబుతున్నారు. 2023లో 2.16 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకోవడం గమనార్హం.

Similar News

News November 19, 2024

కొడంగల్ ఏమైనా పాక్ సరిహద్దుల్లో ఉందా?: కేటీఆర్

image

లగచర్ల ఘటనలో వాస్తవాలను తొక్కిపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR ట్విటర్‌లో ఆరోపించారు. ‘లగచర్లకు పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా? ఇప్పటికే లగచర్లలో కాంగ్రెస్ కిరాతకం ఢిల్లీకి చేరింది. మీ అరాచకపర్వంపై తీవ్ర చర్చ జరుగుతోంది. లగచర్లలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి’ అని డిమాండ్ చేశారు.

News November 19, 2024

US ఎలక్షన్స్: ద్రవ్యోల్బణమే ట్రెండింగ్ టాపిక్

image

US అధ్యక్ష ఎన్నికల్లో ద్రవ్యోల్బణం ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచినట్లు గూగుల్ వేవ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెల్లడించింది. 2020తో పోలిస్తే 114% అధికంగా దీని గురించే సెర్చ్ చేశారని తెలిపింది. ఆ తర్వాత పెన్షన్ ఫండ్స్(76%), బడ్జెట్ లోటు(39%) అంశాలు ఉన్నాయంది. రేసిజం, స్టూడెంట్ లోన్స్, గన్ కంట్రోల్‌పై చర్చ బాగా తగ్గిందని పేర్కొంది. 2020లో ఎలక్ట్రోరల్ ఫ్రాడ్, 2016లో ఒపీనియన్ పోల్ ట్రెండింగ్‌లో నిలిచాయి.

News November 19, 2024

జీవో 16తో ఎంతమంది రెగ్యులరైజ్ అయ్యారంటే?

image

TG:కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన GO 16ను <<14652442>>హైకోర్టు <<>>కొట్టేసింది. ఈ GO ప్రకారం మొత్తం 5,544 మంది రెగ్యులరైజ్ కాగా ఇందులో 2909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది ఒకేషనల్ లెక్చరర్లు, 390 మంది పాలిటెక్నిక్, 270మంది డిగ్రీ కాలేజీ లెక్చరర్లు కాగా, టెక్నికల్ విద్యాశాఖలో 131 మంది, మెడికల్‌లో 837 మంది, 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, మిగతావారు ఫార్మాసిస్టులు, సహాయకులు ఉన్నారు.