News November 19, 2024

వరంగల్ దశ,దిశ మార్చేందుకు వస్తున్నా: రేవంత్

image

వరంగల్ బయల్దేరిన CM రేవంత్ ‘X’లో పోస్ట్ చేశారు. ‘తెలంగాణ చైతన్య రాజధాని, కాళోజీ నుంచి పీవీ వరకు మహనీయులను తీర్చిదిద్దిన నేల. స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్ సార్‌కు జన్మనిచ్చిన గడ్డ. హక్కుల కోసం పోరాడిన సమ్మక్క, సారలమ్మలు నడయాడిన ప్రాంతం. దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రం వరంగల్. వీరి స్ఫూర్తితో మన భవిత కోసం వరంగల్ దశ,దిశ మార్చేందుకు వస్తున్నా’ అని పేర్కొన్నారు.

Similar News

News November 19, 2024

90 నిమిషాలు ఆగిన గుండెకు ప్రాణం పోశారు!

image

ఒడిశాలోని భువనేశ్వర్ AIIMS వైద్యులు అద్భుతాన్ని సాధించారు. గత నెల 1న శుభాకాంత్ సాహూ(24) అనే జవాన్ గుండె 90 నిమిషాల పాటు ఆగగా ఎక్స్‌ట్రాకార్పోరియల్ కార్డియో-పల్మనరీ రిససిటేషన్(eCPR) ద్వారా తిరిగి బతికించారు. ఆ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అశుతోశ్ ఆ వివరాలు తెలిపారు. ‘అతడి గుండె ఆగిన తర్వాత 40 నిమిషాల పాటు మామూలు CPR చేసినా ఉపయోగం లేకపోయింది. eCPRతో బతికించాం’ అని వివరించారు.

News November 19, 2024

విశాఖ అత్యాచార ఘటనపై స్పందించిన హోంమంత్రి

image

AP: విశాఖలో లా స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ సీపీతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘అత్యాచారానికి పాల్పడిన యువకులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని ఆమె భరోసా ఇచ్చారు.

News November 19, 2024

డిసెంబర్లో IPOకు విశాల్ మెగా మార్ట్?

image

దుస్తులు, జనరల్ మర్చండైజ్, FMCGను విక్రయించే విశాల్ మెగామార్ట్ DEC రెండో వారం తర్వాత IPOకు వస్తుందని సమాచారం. ఇష్యూ విలువ రూ.8000 కోట్లని తెలిసింది. నిజానికి నవంబర్లోనే మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలనుకున్నా ప్రస్తుత కరెక్షన్ దృష్ట్యా వాయిదా వేసింది. 2023-24లో కంపెనీ రూ.8,911CR ఆదాయం, రూ.461CR లాభం ఆర్జించింది. విశాల్‌కు చెందిన 19 బ్రాండ్లు రూ.100CR, 6 బ్రాండ్లు రూ.500CR చొప్పున అమ్ముడవ్వడం గమనార్హం.