News November 19, 2024
భూపాపల్లి జిల్లాలో పెద్దపులి కలకలం
భూపాపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పలిమల మండలంలోని కామన్‌పల్లి-ముకునూర్ ప్రధాన రహదారి మధ్యలో కిష్టాపూర్ వద్ద సోమవారం రాత్రి పులి కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ఇదే ప్రాంతంలో రెండేళ్ల క్రితం ఓ పులి పశువులపై దాడి చేసినట్లు తెలిపారు. అధికారులు విచారణ చేపట్టి స్థానికులను అప్రమత్తం చేయాలని పలువురు కోరుతున్నారు.
Similar News
News November 19, 2024
కలెక్టరేట్ ఆడిటోరియం పనులను పరిశీలించిన కలెక్టర్
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం ఆధునీకరణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఆడిటోరియంలో లైటింగ్, సౌండ్స్ ఏర్పాటు పనులను, వేదికను, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. ప్రేక్షకుల సీట్ల సంఖ్య, ఏర్పాటు చేయబోయే వివిధ సౌకర్యాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరమ్మతులకు సంబంధించి డివిజనల్ ఇంజినీర్ యాదగిరికి పలు సూచనలు చేశారు.
News November 18, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ సీఎం పర్యటన నేపథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహించిన సిరిసిల్ల కలెక్టర్. @ పెద్దపల్లిలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్ష. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ధర్మారం మండలంలో ఉరివేసుకొని యువతి ఆత్మహత్య. @ కథలాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. @ రామడుగు పోలీస్ స్టేషన్ ను తనకి చేసిన పోలీస్ కమిషనర్.
News November 18, 2024
వేములవాడ రాజన్నను దర్శించుకున్న 80,981 మంది భక్తులు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాసం సోమవారం పురస్కరించుకొని 80,981 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.