News November 19, 2024
ఆ బ్యాంకుల్లో వాటాలు విక్రయించనున్న కేంద్రం?

ప్రభుత్వ రంగ బ్యాంకులైన CBI, IOB, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో వాటాలు విక్రయించాలని కేంద్రం యోచిస్తోంది! దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు ప్రారంభించింది. కేంద్ర కేబినెట్ ఆమోదానికి త్వరలో ప్రతిపాదనలు పంపనుంది. OFS సేల్ కింద వాటాలు విక్రయించనున్నట్టు తెలుస్తోంది. కంపెనీ షేర్లలో పబ్లిక్ పర్సంటేజ్ నిబంధనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Similar News
News February 1, 2026
నిద్ర లేవగానే ఎన్ని నీళ్లు తాగాలి?

ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది. అయితే ఎన్ని తాగాలనే దానిపై పలువురికి సందేహం ఉంటుంది. వైద్యుల సూచన మేరకు ఖాళీ కడుపుతో 1-2 గ్లాసుల(సుమారు 500ML) వరకు తాగొచ్చు. ఇది రాత్రంతా డీహైడ్రేషన్‌కు గురైన శరీరాన్ని యాక్టివేట్ చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎక్కువగా తాగితే కిడ్నీలపై భారం పడుతుంది. కడుపు ఉబ్బరం, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలొస్తాయి.
News February 1, 2026
బాల్ పడగానే బాదేయడమే: ఇషాన్

తనకు మైలురాళ్ల కంటే జట్టు విజయమే ముఖ్యమని సెంచరీ హీరో ఇషాన్ కిషన్ తెలిపారు. నిన్న సెంచరీ అనంతరం ఆయన మాట్లాడారు. ‘అభిషేక్ మంచి స్టార్ట్ ఇచ్చారు. నేను దాన్ని కొనసాగించా. సింగిల్స్ తీసుకుంటే మంచి ఛాన్స్ మిస్ అయిందని తర్వాత బాధ పడాల్సి వస్తుంది. బాల్ మన రేంజ్‌లో పడగానే బాదే ఛాన్సుంటే బాదేయడమే. నా ఫోకస్ అంతా T20 ప్రపంచకప్ పైనే. అందుకు ఎక్స్‌ట్రా ఎఫర్ట్ అవసరం. ఫామ్ కంటిన్యూ చేయాలి’ అని చెప్పారు.
News February 1, 2026
IISER తిరుపతిలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

AP: తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ <


