News November 19, 2024

లగచర్ల దాడి ఘటనలో A2 సురేశ్ లొంగుబాటు

image

TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, A2గా ఉన్న సురేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడిని కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఇప్పటికే A1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు పరిగి DSPపై బదిలీ వేటుతో పాటు పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేశారు.

Similar News

News November 30, 2024

కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ నిరసన కార్యక్రమాలు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై BJP ‘6 అబద్ధాలు 66 మోసాలు’ నినాదంతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. నేటి నుంచి DEC 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. ఇవాళ కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జ్ షీట్లను ప్రదర్శించనుంది. రేపు జిల్లా స్థాయిలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది. DEC 2, 3న బైక్ ర్యాలీలు నిర్వహించనుంది. ఈ సమయంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 2 వేల మందితో సభలు నిర్వహించనుంది.

News November 30, 2024

డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల కృష్ణారెడ్డి

image

TG: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత తీగల కృష్ణారెడ్డి డిసెంబర్ 3న ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. 2014లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. కాగా ఆయనకు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.

News November 30, 2024

బ్యాంకులు, బీమా కంపెనీల ద్వారా ఉద్యోగులకు ఆరోగ్య బీమా?

image

APలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర వర్గాలకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా వైద్యం అందుతోంది. వీరికి ఆరోగ్య బీమా పథకాన్ని(EHS) జాతీయ బ్యాంకులు, బీమా కంపెనీల ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీమా కోసం ప్రస్తుతం ఏడాదికి ఒక్కో ఉద్యోగి దాదాపు ₹7వేలు చెల్లిస్తున్నారు. అయితే రెండు జాతీయ బ్యాంకుల ప్రీమియం ₹2,500 మాత్రమే ఉంది. దీంతో ఈ విధానం అమలు చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.