News November 19, 2024

ప్రకాశం: పంట పొలాల్లో ఆడ శిశువు లభ్యం

image

అప్పుడే పుట్టిన ఆడ శిశువును పొలాల్లో పడేసిన ఘటన అందరినీ కలచివేస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పట్టాపురంలోని పొలాల్లో మంగళవారం అప్పుడే పుట్టిన ఆడ శిశువు లభ్యమైంది. అటుగా వెళుతున్న స్థానికులు చిన్నారి ఏడుపు విని అక్కడికి వెళ్లి చూడగా.. పసికందు ఏడుస్తూ కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని శిశువును సంతమాగులూరు ప్రాథమిక వైద్యశాలకు తరలించారు.

Similar News

News December 3, 2024

పొన్నలూరు: తల్లితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

image

గతనెల 23న HYDలో పొన్నలూరు(M) చెరుకూరు వాసి మార్క్(26) హత్యకు గురయ్యాడు. అతడు HYDలో నివాసం ఉంటూ సంగీతను వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండగా.. మార్క్ స్వగ్రామం చెరుకూరుకు వెళ్లాడు. తిరిగివచ్చి చూడగా భార్య లేదు. వెంటనే భార్య పుట్టింటికి వెళ్లగా.. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భార్య, ఆమె తల్లి లక్ష్మి, తల్లితో సహజీవనం ఉంటున్న కాశీనాథ్ కలిసి మార్క్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

News December 3, 2024

పేరెంట్ -టీచర్ మీటింగ్ పండుగలా జరగాలి: కలెక్టర్

image

ఈనెల 7వ తేదీన జరిగే మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని, కలెక్టర్ తమీమ్ అన్సారియా జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచి మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు.

News December 3, 2024

ప్రజా ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యత: ప్రకాశం SP

image

సమాజంలోని సామాన్య ప్రజలు, వివిధ రకాల కారణాలతో వచ్చే బాధితుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల అర్జీలను పోలీసు ఉన్నదాధికారులు స్వయంగా స్వీకరించారు. వారితో ముఖాముఖిగా మాట్లాడి త్వరగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు.