News November 19, 2024

2030 నాటికి IHCL హోటల్స్ రెట్టింపు: ఎండీ పునీత్

image

ప్రపంచవ్యాప్తంగా తమ హోటల్స్‌ను రెట్టింపు చేసేందుకు రూ.5వేల కోట్లు వెచ్చించనున్నట్లు టాటా గ్రూప్‌కు చెందిన IHCL ఎండీ పునీత్ వెల్లడించారు. ప్రస్తుతం 350+ ఉన్న హోటళ్ల(రూమ్స్ 30వేలు) సంఖ్యను 2030 నాటికి 700(రూమ్స్ 70వేలు) చేస్తామని తెలిపారు. దక్షిణాసియాలోనే అత్యధిక లాభదాయక, ఐకానిక్ సంస్థగా IHCL మారబోతోందన్నారు. రాబోయే ఐదేళ్లలో కొత్త బ్రాండ్లను పరిచయం చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News November 19, 2024

చేవలేనోనికి బూతులెక్కువ.. సీఎం రేవంత్‌పై హరీశ్ ఫైర్

image

TG: హనుమకొండ సభలో కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన <<14654336>>వ్యాఖ్యలపై<<>> హరీశ్‌రావు మండిపడ్డారు. చేతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు రేవంత్ పరిస్థితి ఉందని విమర్శించారు. 11 నెలల పాలనలో చేసిందేమీ లేక పిచ్చి మాటలు మాట్లాడారని దుయ్యబట్టారు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుంచి లంబాడీ బిడ్డల దాకా రేవంత్ చేసిన ఘోరాలను ప్రజలు మర్చిపోరని చెప్పారు.

News November 19, 2024

విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన జగన్

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించారు. గాంధీనగర్‌ బీఆర్‌టీఎస్‌ రోడ్‌లోని శృంగేరీ శారదా పీఠంలో జగద్గురు విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు. జగన్ వెంట ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్ ఉన్నారు. అంతకముందు జగన్ అభిమానులు పెద్దసంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు.

News November 19, 2024

IND-CHINA: మానసరోవర్ యాత్ర, డైరెక్ట్ ఫ్లైట్స్‌పై చర్చ

image

కరోనా, ఆ తర్వాత తూర్పు లద్దాక్‌లో ఘర్షణల కారణంగా భారత్-చైనా మధ్య 2020 నుంచి డైరెక్ట్ విమాన సర్వీసులు ఆగిపోయాయి. ప్రస్తుతం ఆ విషయంలో పురోగతి కనిపిస్తోంది. జీ20 సమ్మిట్‌లో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యీ <<14650227>>భేటీలో<<>> విమానాల పునరుద్ధరణపై చర్చ జరిగింది. అలాగే చైనా సరిహద్దుల మీదుగా సాగే కైలాష్ మానసరోవర్ యాత్ర ప్రారంభంపైనా సానుకూల డిస్కషన్ జరిగింది.