News November 19, 2024
అంధుల వరల్డ్ కప్‌నుంచి వైదొలగిన టీమ్ ఇండియా
పాకిస్థాన్‌లో ఈ నెల 23 నుంచి వచ్చే నెల 3 వరకు జరిగే అంధుల టీ20 క్రికెట్ వరల్డ్ కప్ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ ఇండియా తప్పుకొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత అంధుల క్రికెట్ అసోసియేషన్(IBCA) ప్రధాన కార్యదర్శి శైలేంద్ర యాదవ్ తెలిపారు. తమతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా పాక్‌కు వెళ్లడం లేదని వెల్లడించారు.
Similar News
News November 19, 2024
రామ్ చరణ్ అన్ని మతాల్ని గౌరవిస్తారు: ఉపాసన
అయ్యప్ప మాలధారణలో దర్గాకు వెళ్లడమేంటంటూ నటుడు రామ్ చరణ్‌పై నెట్టింట పలువురు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలకు ఆయన భార్య ఉపాసన ట్విటర్లో జవాబిచ్చారు. ‘విశ్వాసం అనేది అందర్నీ కలిపి ఉంచేదే తప్ప విడదీసేది కాదు. భారతీయులు అన్ని దారులూ దేవుడి వద్దకే అని భావించి గౌరవిస్తారు. మన బలం ఐక్యతలోనే ఉంది. రామ్ చరణ్ తన ధర్మాన్ని ఆచరిస్తూనే ఇతర మతాల్ని గౌరవిస్తారు’ అని స్పష్టం చేశారు.
News November 19, 2024
ఏపీలో మరో 4 కార్పొరేషన్లు ఏర్పాటు
AP: యాదవ, గౌడ, మాల, గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ల ఏర్పాటుతోపాటు వాటికి సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది చొప్పున 60 మంది సభ్యులను నియమించింది. ప్రతి కార్పొరేషన్లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ సభ్యుడికి అవకాశం కల్పించింది.
News November 19, 2024
రేపటి నుంచి Bank Niftyలో అవి కనిపించవు
రేపటి నుంచి Bank Niftyలో వీక్లీ డెరివేటివ్స్ కనిపించవు. ఈ ఇండెక్స్ Volatilityపై అవగాహన లేని రిటైల్ ట్రేడర్లు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దీంతో ఇక నుంచి ఒక ఇండెక్స్‌లోనే వీక్లీ డెరివేటివ్‌లకు అవకాశం ఇవ్వాలని ఎక్స్ఛేంజ్లను SEBI ఆదేశించింది. దీంతో Nifty వీక్లీ F&Oను అలాగే ఉంచి Bank Nifty వీక్లీ ఆప్షన్స్‌ను తొలగించాలని NSE నిర్ణయించింది. ఈ ఇండెక్స్‌లో Monthly Derivatives మాత్రమే ఉంటాయి.