News November 19, 2024
శబరిమలకు 26 స్పెషల్ రైళ్లు
భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శబరిమలకు 26 స్పెషల్ రైళ్లను నడపనుంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మధ్య ఇవి ప్రయాణించనున్నాయి. నవంబర్ 18, 20, 22, 24, 25, 27, 29 తేదీల్లో.. డిసెంబర్ 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16, 18, 20, 22, 23, 25, 27, 29, 30.. జనవరి 01 తేదీల్లో అందుబాటులో ఉండనున్నాయి. భక్తులు స్పెషల్ రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
Similar News
News November 30, 2024
కోహ్లీ.. ఆ రికార్డు బ్రేక్ చేస్తాడా?
BGT రెండో టెస్టు జరిగే అడిలైడ్ ఓవల్ గ్రౌండ్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుకు చేరువయ్యారు. ఈ మైదానంలో మరో 102 పరుగులు చేస్తే ఆయన లారా అత్యధిక పరుగుల రికార్డును అధిగమించనున్నారు. ఇప్పటివరకు కోహ్లీ ఈ గ్రౌండ్‌లో 509 పరుగులు చేశారు. 611 పరుగులతో లారా, 552 పరుగులతో వివి రిచర్డ్స్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ వేదికలో కోహ్లీ సగటు 60కి పైనే ఉంది. డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు జరగనుంది.
News November 30, 2024
పదేళ్లలో 102% పెరిగిన మెడికల్ కాలేజీలు: నడ్డా
దేశంలో డాక్టర్-జనాభా నిష్పత్తి WHO ప్రమాణం కన్నా మెరుగ్గా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. WHO ప్రకారం 1:1000గా ఉండగా దేశంలో ప్రతి 811 మందికి ఒక వైద్యుడు ఉన్నారని తెలిపారు. ఈ నెల వరకు మొత్తం 13,86,145 మంది వైద్యులు రాష్ట్ర, జాతీయ మెడికల్ కౌన్సిల్ వద్ద రిజిస్టర్ చేసుకున్నట్లు చెప్పారు. 2014లో 387 ప్రభుత్వం కాలేజీలు ఉంటే ఇప్పుడు 102% పెరిగి ఆ సంఖ్య 780గా ఉందన్నారు.
News November 30, 2024
క్రికెటర్లెందుకు చూయింగ్ గమ్ నములుతారు?
క్రికెటర్లు ఆడుతున్నప్పుడు చూయింగ్ గమ్ నములుతూ కనిపిస్తుంటారు. అది కేవలం టైమ్ పాస్ కోసం కాదు. బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఓ గంట గడిచేసరికి శరీరం దానికి అలవాటు పడి రిలాక్స్ అయిపోతుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. చూయింగ్ గమ్ నములుతున్నప్పుడు మెదడు చురుకుగా ఉంటుందని, నిర్ణయాల్ని వేగంగా తీసుకోగలరని పేర్కొంటున్నారు. అదే విధంగా ఒత్తిడిని తగ్గించేందుకూ ఉపకరిస్తుందని వివరిస్తున్నారు.