News November 19, 2024
HNK: కిక్కిరిసిన సభా ప్రాంగణం
హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఇందిరా మహిళా శక్తి సభ ప్రారంభమైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వరంగల్ జిల్లా పరిధిలోని మహిళలు, కాంగ్రెస్ శ్రేణులతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. కార్యక్రమానికి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ముఖ్య నాయకులు హాజరయ్యారు.
Similar News
News November 21, 2024
గిరిజన వర్కింగ్ జర్నలిస్టులకు శిక్షణ తరగతులు
తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో గిరిజన జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. శిక్షణా తరగతులకు హాజరయ్యే గిరిజన వర్కింగ్ జర్నలిస్టులు తమ పేర్లను సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలన్నారు.
News November 21, 2024
పోలీస్ కీర్తి ప్రతిష్ఠలు పెంపొందించే రీతిలో ప్రజాసేవకు అంకితం కావాలి: సీపీ
తోమ్మిది నెలల శిక్షణ పూర్తిచేసుకున్న 246 మంది స్టైఫండరీ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ళ (సివిల్) పాసింగ్ అవుట్ పరేడ్‌ను(దీక్షాంత్ పరేడ్) గురువారం మడికొండలోని సిటి పోలీస్ శిక్షాణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షిస్తూ, పోలీస్ కీర్తి ప్రతిష్ఠలు పెంపొందించే దిశగా నిరంతరం ప్రజల సేవకు అంకితం కావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ళకు పిలుపునిచ్చారు.
News November 21, 2024
హనుమకొండలో డెడికేటెడ్ కమిషన్ బహిరంగ విచారణ
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు ఖరారు కోసం నియమించిన డెడికేటెడ్ కమిషన్ హనుమకొండ కలెక్టరేట్‌లో గురువారం బహిరంగ విచారణ చేపట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయిలో చేపట్టిన ఈ విచారణలో కమిషన్ ఛైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు బీసీ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. ఛైర్మన్ మాట్లాడుతూ.. బీసీ వర్గాల నుంచి స్వీకరించిన అభిప్రాయాలు నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు.