News November 19, 2024
GOLD LOANS ప్రాసెస్‌లో బిగ్ ఛేంజ్
GOLD LOANS ప్రక్రియలో భారీ మార్పు జరగబోతోంది. బ్యాంకులు, NBFCలు నెలవారీ రుణ విమోచన స్కీమ్స్ తెస్తున్నాయి. ఇకపై రుణం మంజూరైన తర్వాత నెల నుంచే కస్టమర్లకు EMI సౌకర్యం కల్పించనున్నాయి. దీంతోపాటు టర్మ్ లోన్ ప్రత్యామ్నాయాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ప్రస్తుతం గోల్డ్ లోన్ తీర్చాలంటే కాలపరిమితి పూర్తయ్యాక అసలు, వడ్డీ కలిపి చెల్లించడం ఒక పద్ధతి. కస్టమర్లకు డబ్బు రాగానే పాక్షికంగా చెల్లించడం రెండోది.
Similar News
News November 30, 2024
క్రికెటర్లెందుకు చూయింగ్ గమ్ నములుతారు?
క్రికెటర్లు ఆడుతున్నప్పుడు చూయింగ్ గమ్ నములుతూ కనిపిస్తుంటారు. అది కేవలం టైమ్ పాస్ కోసం కాదు. బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఓ గంట గడిచేసరికి శరీరం దానికి అలవాటు పడి రిలాక్స్ అయిపోతుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. చూయింగ్ గమ్ నములుతున్నప్పుడు మెదడు చురుకుగా ఉంటుందని, నిర్ణయాల్ని వేగంగా తీసుకోగలరని పేర్కొంటున్నారు. అదే విధంగా ఒత్తిడిని తగ్గించేందుకూ ఉపకరిస్తుందని వివరిస్తున్నారు.
News November 30, 2024
గత ఏడాది అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీలు వీరే
2023-24 ఆర్థిక సంవత్సరానికి అత్యధిక పన్ను చెల్లించిన సెలబ్రిటీల్లో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన రూ.92 కోట్లు చెల్లించారు. ఆయన తర్వాతి స్థానంలో దళపతి విజయ్(రూ.80 కోట్లు), సల్మాన్ ఖాన్(రూ.75 కోట్లు) ఉన్నారు. వారి తర్వాత స్థానాల్లో అమితాబ్(రూ.71 కోట్లు), విరాట్ కోహ్లీ(రూ.66 కోట్లు) నిలిచారు. మహిళా సెలబ్రిటీల్లో కరీనా కపూర్ రూ.20 కోట్లతో టాప్‌లో ఉన్నారు.
News November 30, 2024
24 గంటల్లో శిండే పెద్ద నిర్ణయం తీసుకుంటారు: సంజయ్ శిర్సత్
మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయమై స్పష్టత రాని నేపథ్యంలో శిండే వర్గం నేత సంజయ్ శిర్సత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 24 గంటల్లో షిండే పెద్ద నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. కాగా సీఎం ఎవరనేది అమిత్ షానే నిర్ణయిస్తారని తెలిపారు. డిసెంబర్ 2న ప్రమాణస్వీకారం చేపట్టే అవకాశం ఉందన్నారు. మరోవైపు శిండే ఆకస్మాత్తుగా సొంత గ్రామానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.