News November 19, 2024

HYD: ప్రజావాణి కార్యక్రమంపై మేయర్ సమీక్ష

image

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఈరోజు సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఎటువంటి అలసత్వం వహించకుండా అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు.

Similar News

News November 20, 2024

HYDకు రాష్ట్రపతి.. మాదాపూర్‌లో డ్రోన్‌లు నిషేధం

image

ఈ నెల 21, 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము HYDలో పర్యటిస్తారు. 22న హైటెక్‌‌సిటీ శిల్పకళా వేదికలో లోక్ మంతన్-2024 కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రెసిడెంట్‌ టూర్‌ నేపథ్యంలో CYB పోలీసులు అప్రమత్తమయ్యారు. మాదాపూర్ PS పరిధిలో డ్రోన్లు ఎగరేయడాన్ని నిషేధించారు.ఈ ఆదేశాలు నవంబర్ 22 వరకు అమల్లో ఉంటాయన్నారు. పోలీసుల ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ CP అవినాష్ మహంతి హెచ్చరించారు. SHARE IT

News November 19, 2024

గ్రేటర్ HYD రోడ్డు నెట్వర్క్ లెక్క ఇదే..!

image

గ్రేటర్ HYDలో దాదాపుగా 9,000 KMపైగా రోడ్డు నెట్వర్క్ ఉంది. ఇందులో సుమారు 3,000 కి.మీ బీటీ రోడ్లు, 6,000 కి.మీ పైగా సీసీ రోడ్లు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో CRMP రోడ్లు నిర్మించారు. ప్రస్తుతం 150KM రోడ్డు నెట్వర్క్ నిర్మాణం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే రోడ్ల నిర్మాణంపై రీబౌండ్ హ్యామర్ టెస్ట్, CSC, తార్ డెన్సిటీ పరీక్షలు కరవయ్యాయని పలు పరిశోధనల్లో తేలింది.

News November 19, 2024

HYD: మసకబారుతున్న భవిత.. జాగ్రత్త!

image

HYD, RR జిల్లాలలోని దాదాపుగా 66,000 మంది విద్యార్థులకు కంటి పరీక్షల నిర్వహణ పూర్తయింది. 5-12వ తరగతి చదివే విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలు 4,701 మందికి కంటిచూపు సమస్యలు ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. అనేక మంది విద్యార్థులకు అక్షరాలు మసకబారుతున్నాయని పేర్కొన్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ పరికరాలైన ఫోన్లు, తదితరాలు చూడడమే కారణమని తెలిపారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు.