News November 19, 2024
విశాఖ అత్యాచార ఘటనపై స్పందించిన హోంమంత్రి
AP: విశాఖలో లా స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ సీపీతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘అత్యాచారానికి పాల్పడిన యువకులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని ఆమె భరోసా ఇచ్చారు.
Similar News
News November 19, 2024
అస్సాం సీఎం కీలక నిర్ణయం
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రం దక్షిణ ప్రాంతంలోని కరీంగంజ్ జిల్లా పేరును ‘శ్రీభూమి’గా మారుస్తున్నట్లు క్యాబినెట్ భేటీలో ప్రకటించారు. 100ఏళ్ల క్రితం కవిగురు రవీంద్రనాథ్ ఠాగూర్ కరీంగంజ్ ప్రాంతాన్ని శ్రీభూమిగా అభివర్ణించారని, ఆయన గౌరవార్థం ఈ పేరు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష, ఆశయాలను ప్రతిబింబిస్తోందని ఆయన ట్వీట్ చేశారు.
News November 19, 2024
Breaking: ఏఆర్ రెహమాన్ దంపతుల విడాకులు
ఆస్కార్ విజేత AR రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా బాను విడిపోతున్నట్లు ఆమె తరఫు న్యాయవాది ప్రకటించారు. ‘వారి బంధం చాలాకాలంగా ఒడిదుడుకులతో సాగుతోంది. 29 ఏళ్ల వివాహ బంధం నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయాన్ని సైరా తీసుకున్నారు. తమ మధ్య ఏర్పడిన అగాథం ఇక పోదని ఇద్దరూ భావిస్తున్నారు. ఈ కష్టకాలంలో తన ప్రైవసీని గౌరవించాలని ప్రజల్ని బాను కోరుతున్నారు’ అని ఓ ప్రకటనలో తెలిపారు. వారికి ముగ్గురు పిల్లలున్నారు.
News November 19, 2024
బ్రెజిల్, చిలీ అధ్యక్షులతో మోదీ భేటీ
G20 సమ్మిట్‌లో బ్రెజిల్, చిలీ దేశాధ్యక్షులు లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా, గాబ్రియల్ బోరిక్లతో PM మోదీ సమావేశమయ్యారు. బ్రెజిల్‌తో విద్యుత్, జీవ ఇంధనం, రక్షణ, వ్యవసాయ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్ కృతనిశ్చయంతో ఉందని మోదీ చెప్పారు. ఫార్మాస్యూటికల్స్, టెక్నాలజీ, స్పేస్ తదితర రంగాల్లో చిలీతో సంబంధాలు బలపడుతున్నాయని తెలిపారు. చిలీలో ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరగడం ఆనందంగా ఉందన్నారు.