News November 19, 2024
రాజమండ్రి: ‘భూ మాఫియాపై విచారణ జరపాలి’

రాజమండ్రిలో జరుగుతున్న భూ మాఫియాపై విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ మేరకు రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌కు లేఖ అందచేశారు. రాజమండ్రి భాస్కర్ నగర్‌లో 38 ఎకరాలలో ని ప్లాట్లు భూమాఫియా చేతిలోకి వెళ్లాయని, దీనిలో వైసీపీ హస్తం ఉందన్నారు. దీనిపై నిజాలు నిగ్గు తేల్చాలన్నారు.
Similar News
News April 16, 2026
మే 9న కొవ్వూరులో జాతీయ లోక్ అదాలత్

రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఆదేశాల మేరకు మే 9న కొవ్వూరు కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు 9వ జిల్లా జడ్జి ఎం.అనురాధ తెలిపారు. ఈ అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటార్ వాహన ప్రమాద బీమా కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. భార్యాభర్తల తగాదాలు, గృహహింస కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 15, 2026
ఈనెల 17న రాజమండ్రిలో జాబ్ మేళా

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 17వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ బుధవారం తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలలోని ఉద్యోగాలకు కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూ నిర్వహిస్తారని తెలియజేశారు. టెన్త్, ఇంటర్, ITI, డిగ్రీ, M.B.A పూర్తిచేసి 19 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని వివరించారు.