News November 19, 2024
యూపీలో ఈ సారి దమ్ము చూపేదెవరు?

UPలో బుధవారం 9 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు జరగనున్నాయి. LS ఎన్నికల్లో SP అత్యధికంగా 37 సీట్లు గెలిచి BJPకి సవాల్ విసిరింది. దీంతో ఈ ఎన్నికల్ని BJP సవాల్‌గా తీసుకుంది. నలుగురు SP, ముగ్గురు BJP, RLD, నిషాద్ పార్టీ నుంచి ఒకరు MLAలుగా రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. విడిపోతే నష్టపోతాం అంటూ CM యోగి – పీడితులు, దళితులు, అల్పసంఖ్యాకుల ఐక్యత పేరుతో అఖిలేశ్ ప్రచారాన్ని నడిపారు.
Similar News
News November 8, 2025
పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలు

ఈ వ్యాధి సోకిన పశువులకు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారతాయి. చర్మం గరుకుగా మారి నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం వల్ల పశువులు మేత మేయలేవు. నీరసంగా ఉంటాయి. పశువుకు 104 నుంచి 105 డిగ్రీల ఫారన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది. పాడిగేదెల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి అలసటకు గురై నీరసంగా మారతాయి.
News November 8, 2025
పిల్లల్లో మల బద్ధకం తగ్గాలంటే..

చాలామంది పేరెంట్స్ పిల్లలు ఇష్టంగా తింటున్నారు కదాని బిస్కెట్లు, కార్న్ ఫ్లేక్స్, నూడుల్స్, పెరుగన్నం వంటివి పెడతారు. వీటివల్ల ఆకలి తీరుతుంది కానీ మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. పిల్లల ఆహారంలో పీచు పదార్థాలు చేర్చాలని సూచిస్తున్నారు. దీనికోసం పొట్టుతో ఉన్న ఓట్స్, మిల్లెట్స్, గోధుమ పిండి, బెండకాయ, చిక్కుడు, వంకాయ, క్యారెట్ ఇస్తే మలబద్ధకం తగ్గుతుందంటున్నారు.
News November 8, 2025
గన్స్ కావాలా? ల్యాప్‌టాప్స్ కావాలా? : మోదీ

బిహార్ స్టూడెంట్స్‌కు తమ ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు, ఫుట్‌బాల్, హాకీ స్టిక్స్ ఇచ్చిందని, ఆర్జేడీ తుపాకులు ఇవ్వడం గురించి మాట్లాడుతోందని ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. బిహార్ ప్రజలు తుపాకుల ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదన్నారు. జంగిల్‌రాజ్ పాలనలో రాష్ట్రంలో ఓ పెద్ద హాస్పిటల్ కానీ, మెడికల్ కాలేజీ కానీ ఏర్పాటు చేయలేదన్నారు. వారికి పరిశ్రమలు మూసివేయడమే తెలుసని సీతామఢీలో నిర్వహించిన ప్రచారంలో విమర్శించారు.


