News November 19, 2024

హెచర్చరికలు జారీ చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్

image

ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బందులు పెట్టే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. ఉంగుటూరు నియోజకవర్గంలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు వ్యవసాయం, ఉద్యానవనాలు, పశుసంవర్థకం, అక్వా రంగాల క్షేత్రాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Similar News

News December 3, 2024

వ్యక్తి తలపై కత్తితో దాడి: ఎస్ఐ జయబాబు

image

టీ.నర్సాపురం మండలం రాజుపోతేపల్లికి చెందిన నత్త నాగరాజుపై డిసెంబర్ 2న గుమ్మల్ల స్వామి అనే వ్యక్తి కత్తితో తలపై తీవ్రంగా దాడి చేసినట్లు ఎస్ఐ జయబాబు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. భూ వివాదాల నేపథ్యంలో హత్యాయత్నం జరిగిందన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 3, 2024

ఏలూరు జిల్లాలో రూ.367.63 కోట్ల ధాన్యం కొనుగోలు

image

ఏలూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు రూ.367.63 కోట్ల విలువైన 159782.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 20,959 మంది రైతుల నుండి కోనుగోలు చేశామని జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెం.18004256453 కు ఫోన్ చేయాలన్నారు.

News December 3, 2024

పెనుమంట్ర: బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

image

పెనుమంట్ర మండలం మార్టేరులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మార్టేరు నుంచి పెనుగొండ వెళ్లే రోడ్డులో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా.. గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.