News November 19, 2024
కృత్రిమ వర్షం అంటే ఏంటి?

ఢిల్లీలో వాయు నాణ్యత మెరుగుపడాలంటే కృత్రిమ వర్షం కురిపించాలని మంత్రి గోపాల్ కేంద్రాన్ని కోరగా, దానిపై చర్చ మొదలైంది. మేఘాల్లో సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రైఐస్ వంటి కెమికల్స్ చల్లి వర్షం కురిపించడాన్నికృత్రిమ వర్షం లేదా క్లౌడ్ సీడింగ్ అంటారు. తేమతో ఉన్న మేఘాలు, గాలి వాటం సరైన స్థితిలో ఉంటేనే దీనికి వీలవుతుంది. స్టాటిక్, డైనమిక్ రకాలుండగా.. ముందుగానే కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
Similar News
News January 9, 2026
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, బెల్టులు

TG: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, బెల్టులు ప్రభుత్వం అందజేయనుంది. విద్యాశాఖ ప్రతిపాదనలను CM రేవంత్ రెడ్డి ఆమోదించారు. తద్వారా దాదాపు 20 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. అదే సమయంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆడబిడ్డలకు ప్రాధాన్యం ఇవ్వాలని CM సూచించారు. దీంతో మొదటి విడత పాఠశాలలు బాలికలకు కేటాయించనున్నారు.
News January 9, 2026
ఇకపై షోరూంలోనే వెహికల్ రిజిస్ట్రేషన్

TG: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ షోరూంలోనే పూర్తి చేసుకోవచ్చు. ఈ విధానం 15 రోజుల్లో అమలులోకి రానుంది. దీంతో ఇకపై కొత్త కారు, బైక్ కొన్నప్పుడు RTA ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. డీలర్ ఆన్‌లైన్‌లో అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. RC నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికే వచ్చేస్తోంది. ఈ సౌకర్యం నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.
News January 9, 2026
అమరావతిలో 3500 టన్నుల కంచుతో భారీ NTR విగ్రహం

AP: రాజధాని అమరావతి ప్రాంతంలోని నీరుకొండలో సుమారు 3500 టన్నుల కంచుతో భారీ NTR విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లను క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలించింది. విగ్రహంతోపాటు స్మృతివనం డిజైన్లను ఫైనలైజ్ చేసేందుకు ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (AGICL) పర్యవేక్షించనుంది.


