News November 19, 2024
కృత్రిమ వర్షంతో కాలుష్యం తగ్గుతుందా?
ఢిల్లీలో ప్రమాదకర స్థాయిని దాటిపోయిన వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి <<14651362>>కృత్రిమ వర్షం<<>> కురిపించాలనే డిమాండ్లు వస్తున్నాయి. దీనివల్ల దుమ్ము, ధూళి రేణువులు వర్షపు బిందువులతో కలిసి భూమిని చేరతాయి. దీంతో గాలి కాలుష్యం కొంత తగ్గుతుందని, ఈ ప్రభావం గరిష్ఠంగా రెండు వారాలే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పైగా 1,483 చ.కి.మీ పరిధిలో విస్తరించిన ఢిల్లీ మొత్తంపై కృత్రిమ వర్షాలు కురిపించడం ఈజీ కాదంటున్నారు.
Similar News
News November 29, 2024
రాజ్యసభ సీటు వార్తలపై నాగబాబు ఏమన్నారంటే?
AP: తనకు రాజ్యసభ సీటుపై Dy.cm పవన్ ఢిల్లీ పర్యటనలో <<14729358>>చర్చించారన్న<<>> వార్తలపై నాగబాబు స్పందించారు. ‘అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే. సత్యం, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడుతాడు. ఢిల్లీ వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. అలాంటి నాయకుడి కోసం నా లైఫ్ ఇవ్వడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను’ అని ట్వీట్ చేశారు.
News November 29, 2024
దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. త్వరలో ట్రయల్ రన్!
దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు ట్రయల్ రన్‌ను త్వరలో హరియాణాలోని జింద్-సోనిపట్ స్టేషన్ల మధ్య నిర్వహించనున్నారు. 8 కోచ్‌లు ఉండే ఈ రైలులో 2,638 మంది ప్రయాణించవచ్చు. గరిష్ఠ వేగం 110km/h ఉంటుంది. ఈ ట్రైన్ డిజైన్‌ను RDSO రూపొందించింది. ప్రస్తుతం దీనిని ‘నమో గ్రీన్ రైలు’గా పిలుస్తున్నారు. కాగా ప్రపంచంలో జర్మనీ మాత్రమే ప్రస్తుతం హైడ్రోజన్ ట్రైన్లను నడుపుతోంది.
News November 29, 2024
30 ఏళ్ల క్రితం కిడ్నాప్.. ఇప్పుడు తిరిగొచ్చాడు
1993, సెప్టెంబర్ 8న ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లో కిడ్నాపైన రాజు 30 ఏళ్ల తర్వాత తిరిగొచ్చారు. స్కూల్ నుంచి వస్తుండగా తనను కిడ్నాప్ చేసి రాజస్థాన్ తీసుకెళ్లారని అతను చెప్పారు. రోజూ కొడుతూ పని చేయించారని, పారిపోకుండా రాత్రి పూట తాళ్లతో కట్టేసేవారని చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు తప్పించుకొని ఢిల్లీ చేరుకున్న అతను 5 రోజుల కిందట ఖోడా పోలీసులను సంప్రదించారు. వారు మీడియా సాయంతో కుటుంబం వద్దకు చేర్చారు.