News November 19, 2024
శ్రీశైల మల్లన్నకు రూ.4.14 కోట్ల హుండీ ఆదాయం

శ్రీశైలంలో మంగళవారం దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో జరిగిన హుండీల లెక్కింపులో రూ.4,14,15,623ల ఆదాయం సమకూరింది. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 18 వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా అందులో ఈ నగదుతోపాటు 322 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారు, 8 కేజీల 520 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా ఇతర దేశాలకు చెందిన కరెన్సీలు కూడా సమకూరాయి. దేవస్థానం అధికారులు హుండీ లెక్కింపును పగడ్బందీగా చేపట్టారు.
Similar News
News September 16, 2025
కర్నూలు: సత్తా చాటిన కడప జట్లు

కర్నూలులో రెండు రోజుల పాటు 17వ రాష్ట్రస్థాయి మినీ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలు జరిగాయి. బాలురు, బాలికల విభాగంలో కడప జట్టు మొదటి స్థానంలో నిలిచి డబుల్ క్రౌన్ సాధించింది. కర్నూలు బాలుర జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. విజేతలకు జిల్లా ఒలంపిక్ సంఘ అధ్యక్షుడు రామాంజనేయులు, ఏపీ హ్యాండ్ బాల్ సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు బహుమతులు అందజేశారు.
News September 15, 2025
పూర్వ విద్యార్థుల సాయం హర్షణీయం: MP

KNL: పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని కర్నూలు ఎంపీ నాగరాజు తెలిపారు. నగరంలోని రాక్ వుడ్ మెమోరియల్ పాఠశాలలో 1976-1986 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం జరిగింది. ఎంపీ పాల్గొని ఆరోజులను గుర్తు చేసుకున్నారు. రాక్ వుడ్ పాఠశాలను తిరిగి స్కూల్, లేదా స్టడీ సర్కిల్‌గా ఏర్పాటు చేసేందుకు విద్యార్థులు ముందుకు వచ్చారని, తన వంతు సాయం చేస్తానని చెప్పారు.
News September 15, 2025
ఉద్యోగాల పేరుతో మోసపోకండి: కర్నూలు SP

ఉద్యోగుల పేరుతో నిరుద్యోగులు మోసపోవద్దని.. పోటీ పరీక్షల ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 81 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని త్వరగా పరిష్కరిస్తామన్నారు. అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తదితరులు ఉన్నారు.