News November 19, 2024

కోడి ముందా? గుడ్డు ముందా? సమాధానమిదే!

image

కోడి ముందా? గుడ్డు ముందా? అనే ప్రశ్నకు ఇప్పటిదాకా సరైన జవాబే దొరకలేదు. శాస్త్రవేత్తలను సైతం ఇబ్బంది పెట్టిన ఈ ప్రశ్నకు తాజాగా సమాధానం లభించింది. జెనీవా యూనివర్సిటీలోని జీవరసాయన శాస్త్రవేత్త మెరైన్ ఒలివెట్టా నేతృత్వంలోని బృందం దీనిపై పరిశోధన చేసింది. జంతువుల ఆవిర్భావానికి ముందే పిండం లాంటి నిర్మాణాలుండవచ్చని అంచనా వేశారు. అంటే దీని ప్రకారం కోడి ముందు కాదు. దీనిపై ఇంకా ఇతర పరిశోధనలు జరుగుతున్నాయి.

Similar News

News November 29, 2024

OTP డెలివరీల్లో ఆలస్యం ఉండదు: ట్రాయ్

image

నెట్ బ్యాంకింగ్, ఆధార్ OTPల డెలివరీల్లో December 1 నుంచి ఆలస్యం కానున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని TRAI ఖండించింది. OTPలు ఎప్పటిలాగే సత్వరమే అందుతాయని తెలిపింది. ఫేక్ కాల్స్, ఫ్రాడ్ మెసేజ్‌లను అరికట్టేందుకు మెసేజ్ ట్రేస్‌బిటిలీ వ్యవస్థను తీసుకొచ్చామని, దీని ప్రభావం OTP డెలివరీలపై పడదని పేర్కొంది. సైబర్ మోసాలను అడ్డుకునేందుకు OTPలను సమీక్షించాలని టెలికం సంస్థలను TRAI ఆదేశించిన సంగతి తెలిసిందే.

News November 29, 2024

రాష్ట్రానికి తప్పిన ముప్పు

image

ఏపీకి తుఫాను ముప్పు లేదని వాతావరణ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుఫానుగా రూపాంతరం చెందలేదని, ఇది ఈ సాయంత్రం వరకు వాయుగుండంగా బలహీనపడుతుందన్నారు. రేపు ఉదయం కల్లా కారైకాల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని చెప్పారు. తుఫాన్ ముప్పు లేకున్నా వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News November 29, 2024

భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వణికిస్తున్న చలి

image

APలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా మన్యంలో చలి పంజా విసురుతోంది. గత ఏడాది NOV 10-30 తేదీల్లో 13-13.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఈసారి మరో 5డిగ్రీలు తగ్గిపోయాయి. నిన్న డుంబ్రిగూడలో 8.6, జి.మాడుగుల, జీకే వీధిలో 8.7, హుకుంపేటలో 8.8, అరకులోయలో 9.1డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని, ఉదయం, సాయంత్రం బయటికెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.