News November 19, 2024

వారి ప్రయాణం మొదలై ఆరేళ్లు: DVV ఎంటర్టైన్మెంట్

image

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన RRR ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ 2018, నవంబరు 19న మొదలైన విషయాన్ని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ట్విటర్‌లో గుర్తుచేసింది. ‘వారిద్దరూ కలిసి ప్రయాణించారు. కలిసి సాధించారు. RRR తొలి అడుగు వేసి నేటికి ఆరేళ్లు’ అని ట్వీట్ చేసింది. 2022, మార్చి 25న విడుదలైన RRR ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం.

Similar News

News April 16, 2026

మార్కెట్ షేర్‌లో మారుతీ రివర్స్ గేర్

image

2026 ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ మార్కెట్ షేర్ 39.26%కి పడిపోయింది. 13 ఏళ్లలో ఇదే కనిష్ఠం. ఒకప్పుడు సగానికి పైగా మార్కెట్‌ను ఏలిన మారుతీ.. పెరుగుతున్న పోటీ, కస్టమర్ల అభిరుచులు మారడంతో వరుసగా మూడో ఏడాదీ వెనకబడింది. 2020 నుంచి చూస్తే కంపెనీ ఏకంగా 12% మార్కెట్ షేర్‌ను కోల్పోయిందని SIAM గణాంకాలు చెబుతున్నాయి. ఇతర కంపెనీల SUVs హవా పెరగడమే మారుతీకి నెగటివ్‌గా మారినట్లు స్పష్టమవుతోంది.

News April 16, 2026

దేవతలు కలలో వస్తే ఏం జరుగుతుంది?

image

కలలో దేవతలు కనిపించడం శుభప్రదమట. ఇది మీపై దైవానుగ్రహం ఉందని, త్వరలోనే మీ సమస్యలు తొలగిపోతాయని సూచనట. అలాగే శుభవార్తలు వింటారని చెప్పడానికి సంకేతమని స్వప్నశాస్త్రం చెబుతోంది. ‘దేవతలు ఆశీర్వదిస్తున్నట్లు, చిరునవ్వుతో కనిపిస్తే తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కోపంగా ఉన్నట్లు కనిపిస్తే మీరు ఏదైనా ధర్మ కార్యంలో పొరపాటు చేస్తున్నారని, మొక్కులు మరచిపోయారని అర్థం’ అని సూచిస్తున్నారు నిపుణులు.

News April 16, 2026

కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

image

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.