News November 20, 2024

లెబనాన్‌లో 200 మంది చిన్నారుల మృతి

image

లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తూనే ఉంది. ఇప్పటివరకు చేసిన అటాక్స్‌లో 200 మందికి పైగా చిన్నారులు మరణించారని, 1,100 మంది పిల్లలు గాయపడ్డారని UNICEF వెల్లడించింది. 2 నెలలుగా రోజుకు ముగ్గురు చొప్పున చిన్నారులు మృత్యువాత పడుతున్నట్లు తెలిపింది. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా రాకెట్లు ప్రయోగించగా, ఇజ్రాయెల్ చేసిన ప్రతిదాడుల్లో మొత్తం 3,510 మంది పౌరులు చనిపోయారు.

Similar News

News November 20, 2024

విడాకులపై ఏఆర్.రెహమాన్ ట్వీట్.. ఏమన్నారంటే?

image

భార్యతో విడాకులు తీసుకోవడంపై ఏఆర్.రెహమాన్ ట్వీట్ చేశారు. ‘మేము మా బంధంలో ముప్పై ఏళ్లు పూర్తి చేసుకోవాలనుకున్నాం. కానీ ఊహించని విధంగా ఇది ముగిసింది. విరిగిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా వణుకుతుంది. విడిపోవడంలోనూ మేము అర్థాన్ని వెతుకుతాము. అయినప్పటికీ పగిలిన ముక్కలు మళ్లీ ఒక్కటి కాలేకపోవచ్చు. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించినందుకు అందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

News November 20, 2024

ఓపెనర్‌గా KL? మూడో స్థానంలో పడిక్కల్?

image

BGT తొలి టెస్టులో జైస్వాల్‌కు జోడీగా KL రాహుల్ ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉందని espncricinfo పేర్కొంది. మూడో స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్, నాలుగో స్థానంలో కోహ్లీ, ఐదో స్థానంలో పంత్ ఆడతారని తెలిపింది. ఆరో స్థానం కోసం సర్ఫరాజ్, జురెల్ మధ్య పోటీ ఉందని, ఆల్‌రౌండర్ కోటాలో నితీశ్, అశ్విన్‌కు చోటు దక్కొచ్చని పేర్కొంది. పేసర్లలో బుమ్రాతో పాటు హర్షిత్ రాణా, సిరాజ్/ఆకాశ్‌దీప్‌ ఆడొచ్చని అంచనా వేసింది.

News November 20, 2024

ప్రజలకు TGPSC క్షమాపణలు చెప్పాలి: KTR

image

TG: గ్రూప్-3 ప్రశ్న పత్రంలో తక్కువ కులం, ఉన్నత కులం అనే పదాలు వాడారని డా.RS. ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్‌పై KTR స్పందించారు. ‘TGPSC ఈ రకమైన కులతత్వ ఎజెండాను ప్రోత్సహించడం సిగ్గుచేటు. దీనిపై కమిషన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని అన్నారు. ‘తక్కువ కులం, ఎక్కువ కులం అన్న పదాలు ప్రభుత్వ పరీక్షా పత్రాల్లోనే ఉంటే ఇక సామాజిక న్యాయం ఎలా వస్తుంది రేవంత్ గారూ?’ అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.