News November 20, 2024

రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి: భట్టి

image

బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణాల వల్లనే రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72వేల కోట్లను ప్రజా ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. దేశంలో ఒకే రోజు రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసి దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని పేర్కొన్నారు.

Similar News

News November 20, 2024

కల్లూరు డివిజన్లో 63% సమగ్ర సర్వే పూర్తి 

image

కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 6 మండలాలలో సమగ్ర సర్వే 63% పూర్తి చేసినట్లు ఆర్డీఓ రాజేందర్ తెలిపారు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని కల్లూరు, తల్లాడ, వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి, ఏన్కూర్ మండలాలలో, 1,03,453 కుటుంబాలకు గానూ 64,483 కుటుంబాల సర్వే జరిగినట్లు ఆర్డీఓ వివరించారు. ఈనెల 24వ తేదీ వరకు దాదాపు సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు, కృషి చేస్తున్నట్లు ఆర్టీఓ అన్నారు.

News November 20, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి కలెక్టర్ల సమీక్ష సమావేశం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రామదాసు నాయక్ పర్యటన ∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన

News November 20, 2024

చింతూరు: ఒకేరోజు 40 కిలోల గజాలు పట్టివేత

image

చింతూరు డివిజన్ డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు 40 కిలోల గంజాయి పట్టుబడింది. బైక్‌పై 10 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను డొంకరాయి ఎస్ఐ శివకుమార్ అరెస్ట్ చేశారు. మోతుగూడెం ఎస్ఐ శివన్నారాయణ రెండు బైకులపై తరలిస్తున్న 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.