News November 20, 2024
NLG: ఎత్తిపోతల పథకం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకం ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల వద్ద ఉన్న బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకం సిస్టర్న్, కుడి, ఎడమ డిస్ట్రిబ్యూటరీ కాలువలను పరిశీలించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ప్రారంభానికి రానున్నట్లు తెలిపారు.
Similar News
News November 3, 2025
పోలీస్ గ్రీవెన్స్‌లో 45 ఫిర్యాదులు

పోలీస్ గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 45 మంది అర్జీదారులతో మాట్లాడారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. సత్వర న్యాయం జరిగే విధంగా పనిచేయాలని, తక్షణమే సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.
News November 3, 2025
చిట్యాల అండర్‌పాస్ వద్ద సమస్య పరిష్కారానికి ఎస్పీ పర్యవేక్షణ

జాతీయ రహదారి 65 పై చిట్యాల రైల్వే బ్రిడ్జి అండర్‌పాస్ వద్ద వర్షపు నీరు నిలిచి తీవ్ర ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు.
News November 3, 2025
ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆమె జిల్లా అధికారులను ఆదేశించారు.


