News November 20, 2024

నవంబర్ 20: చరిత్రలో ఈ రోజు

image

1750: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం
1910: ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ మరణం
1956: తెలుగు సినీ దర్శకుడు వంశీ జననం
1969: నటి శిల్పా శిరోద్కర్ జననం
1981: భాస్కర-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో (ఫొటోలో)
1994: నటి ప్రియాంక మోహన్ జననం
* ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం

Similar News

News April 19, 2026

హైదరాబాద్‌లో హడలెత్తిస్తోన్న ‘హార్ట్ స్ట్రోక్’

image

హైదరాబాద్‌లో ‘హార్ట్ స్ట్రోక్’ హడలెత్తిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా ఆకస్మిక గుండెపోటు ఘటనలు పెరుగుతున్నాయి. చెడు అలవాట్లు లేని వారినీ ఈ ప్రాణాంతక వ్యాధి వదలడం లేదు. ఛాతిలో నొప్పిగా అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. నిత్య వ్యాయామం, సమతుల్య ఆహారం, సరిపడా నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొంటున్నారు.

News April 19, 2026

SC, STలకు ఉచితంగా సోలార్ విద్యుత్ ప్యానెళ్లు: మంత్రి

image

AP: పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా SC, STలకు ఉచితంగా సోలార్ విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, ఇతరులకు 40% రాయితీతో పంపిణీ చేస్తామన్నారు. ఈ స్కీమ్ ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గించవచ్చని, అదనంగా ఉత్పత్తి చేసే విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్మవచ్చని వివరించారు.

News April 19, 2026

ప్రభ్‌సిమ్రన్.. మ్యాచును మలుపు తిప్పేస్తాడు!

image

పంజాబ్ విజయాల్లో శ్రేయస్‌తో పాటు ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ పాత్ర ఎంతో ఉంది. బౌలర్ ఎవరనేది లెక్క చేయకుండా సిక్సర్లు, బౌండరీలతో మ్యాచును మలుపు తిప్పేయడం ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్ స్పెషాలిటీ. ఇప్పటివరకు 56 IPL మ్యాచుల్లో 1,516 రన్స్ చేశారు. 2023లో ఢిల్లీపై సెంచరీ చేశారు. స్ట్రైక్ రేట్ 154గా ఉంది. 2026 సీజన్లో 5 మ్యాచుల్లోనే 70 సగటుతో 211 రన్స్ చేశారు. తాను యువీ వద్ద ట్రైనింగ్ తీసుకున్నానని ఇటీవల చెప్పారు.