News November 20, 2024

24న గుంటూరుకు పవన్ రాక

image

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈనెల 24న గుంటూరు నగరానికి రానున్నారు. సంపత్ నగర్‌లోని శ్రీ శృంగేరి శారదా పీఠంలో వేదమహాసభలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శారదాపీఠం జగద్గురువు విధుశేఖర భారతీ మహాస్వామితో కలిసి పవన్ ఇందులో పాల్గొంటారు.

Similar News

News November 8, 2025

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్పీ

image

గుంటూరులో నిర్వహించిన పోలీసు సిబ్బంది గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ 13 వినతులను స్వీకరించారు. బదిలీలు, ప్రమోషన్లు, క్వార్టర్స్ కేటాయింపు, వైద్య సాయం వంటి పలు అంశాలపై వినతులు వచ్చాయి. వీటిని నిష్పాక్షికంగా పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.

News November 7, 2025

GNT: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

శంకర కంటి ఆసుపత్రి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 9న సీఎం చంద్రబాబు విచ్చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. పెదకాకాని మండలంలో హెలిపాడ్, సీఎం పాల్గొనే ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News November 7, 2025

గుంటూరు జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు

image

రహదారి ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. కాజా టోల్గేట్, తాడికొండ అడ్డరోడ్డు, పేరేచర్ల, నారాకోడూరు, నందివెలుగు రోడ్డు, వాసవి క్లాత్ మార్కెట్, చుట్టుగుంట ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. 78 వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటూ రూ. 7,79,720 జరిమానా విధించామని SP వకుల్ జిందాల్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని అంబులెన్స్ సీజ్ చేశామన్నారు.