News November 20, 2024
ప్రజలకు TGPSC క్షమాపణలు చెప్పాలి: KTR
TG: గ్రూప్-3 ప్రశ్న పత్రంలో తక్కువ కులం, ఉన్నత కులం అనే పదాలు వాడారని డా.RS. ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్‌పై KTR స్పందించారు. ‘TGPSC ఈ రకమైన కులతత్వ ఎజెండాను ప్రోత్సహించడం సిగ్గుచేటు. దీనిపై కమిషన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని అన్నారు. ‘తక్కువ కులం, ఎక్కువ కులం అన్న పదాలు ప్రభుత్వ పరీక్షా పత్రాల్లోనే ఉంటే ఇక సామాజిక న్యాయం ఎలా వస్తుంది రేవంత్ గారూ?’ అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
Similar News
News November 20, 2024
మహారాష్ట్రలోనూ ఓటేయనున్న రాష్ట్ర ఓటర్లు
TG: రాష్ట్రంలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని 12 గ్రామాల ప్రజలకు మహారాష్ట్రలోనూ ఓటు హక్కు ఉంది. పరందోళి, గౌరి, పద్మావతి, ముక్దంగూడ, బోటాపటార్, ఇసాపూర్, లెండిగూడ, ఇందిరానగర్, శంకర్ లొద్ది, మహారాజ్ గూడ, అంతాపూర్ ప్రజలకు రాజురా నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది. ఈ గ్రామాల్లో 3 వేలకుపైగా ఓటర్లు ఉన్నారు. కాగా రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉన్న కెరమెరి మండలం ఎప్పటి నుంచో వివాదంలో ఉంది.
News November 20, 2024
వారికి 500 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ: మంత్రి సవిత
AP: రాష్ట్రంలో మరమగ్గాలు ఉన్న వారికి 500 యూనిట్లు, చేనేత మగ్గాలు ఉన్నవారికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని మంత్రి సవిత తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్, 5% GST రీయింబర్స్‌మెంట్ కల్పిస్తామని చెప్పారు. ‘కర్నూలు, విజయనగరంలో చేనేత శాలలు ఏర్పాటు చేస్తాం. ఇందుకు స్థానిక MPలు రూ.కోటి చొప్పున నిధులు కేటాయించారు. చేనేత వస్త్రాల మార్కెటింగ్ కోసం విదేశాల్లో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తాం’ అని ఆమె తెలిపారు.
News November 20, 2024
చివరి మ్యాచ్ ఆడేసిన రఫెల్ నాదల్
స్పానిష్ ప్లేయర్ రఫెల్ నాదల్ టెన్నిస్ కెరీర్‌కు తెరపడింది. డేవిస్ కప్ తర్వాత తాను రిటైర్ కానున్నట్లు ఆయన గతంలోనే ప్రకటించారు. తాజాగా జరిగిన డేవిస్ కప్ QFలో స్పెయిన్ ఓడిపోవడంతో ఆటగాడిగా ఆయన ప్రయాణం ముగిసింది. చివరగా నెదర్లాండ్స్ ప్లేయర్ జాండ్‌షల్ప్‌తో జరిగిన సింగిల్స్ మ్యాచులో 4-6, 4-6 తేడాతో ఆయన ఓడారు. మ్యాచ్ అనంతరం ఎమోషనల్ అయ్యారు. నాదల్ తన కెరీర్‌లో మొత్తం 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచారు.