News November 20, 2024

ఇవాళ్టి నుంచి కాలేజీలు బంద్

image

TG: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో అన్ని డిగ్రీ, పీజీ కాలేజీల బంద్‌కు డిగ్రీ కాలేజీల అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం ఇవాళ్టి నుంచి ఈ బంద్ చేపట్టింది. బకాయిలు విడుదలయ్యే వరకు కాలేజీలు తెరిచేది లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది. గత నెలలో నాలుగు రోజులు కాలేజీలు బంద్ చేసినప్పుడు, 3-4 రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని గుర్తు చేసింది.

Similar News

News November 28, 2024

బీ-ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్

image

AP: ఎంపీసీ, బైపీసీ విభాగాల్లోని బీ-ఫార్మసీ సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపీసీ స్టూడెంట్స్ రేపు, ఎల్లుండి ఫీజు చెల్లించవచ్చు. ఆప్షన్స్ నమోదుకు డిసెంబర్ 1 వరకు ఛాన్స్ ఉంటుంది. 5వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. బైపీసీ విద్యార్థులు ఈ నెల 30 నుంచి DEC 5 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 3 నుంచి 7 వరకు ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. 12వ తేదీ నుంచి తరగతులు మొదలవుతాయి.

News November 28, 2024

కీర్తి సురేశ్ పెళ్లి ఎప్పుడంటే?

image

‘మహానటి’ కీర్తి సురేశ్ పెళ్లి పీటలెక్కనున్నారు. తన ప్రియుడు ఆంటోనీని ఆమె వివాహమాడనున్నట్లు నిన్న ప్రకటించారు. కాగా వీరి వివాహం వచ్చే నెల 11న గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో జరగనుందని సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కీర్తి నటించిన బేబీ జాన్(బాలీవుడ్), ఓ తమిళ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

News November 28, 2024

చంద్రబాబుపై కేసుల్లో కౌంటర్ వేయండి: హైకోర్టు

image

AP: 2014-19 మధ్య స్కామ్‌లు జరిగాయంటూ చంద్రబాబుపై నమోదైన కేసులు, ఛార్జిషీట్లను హైకోర్టు ముందు ఉంచాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్‌పై న్యాయస్థానం స్పందించింది. వీటిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులను సీబీఐ, ఈడీలకు అప్పగించాలన్న పిల్‌పై కౌంటర్ దాఖలుకు మరింత సమయం ఇచ్చింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.