News November 20, 2024
చింతూరు: ఒకేరోజు 40 కిలోల గజాలు పట్టివేత

చింతూరు డివిజన్ డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు 40 కిలోల గంజాయి పట్టుబడింది. బైక్పై 10 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను డొంకరాయి ఎస్ఐ శివకుమార్ అరెస్ట్ చేశారు. మోతుగూడెం ఎస్ఐ శివన్నారాయణ రెండు బైకులపై తరలిస్తున్న 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Similar News
News October 17, 2025
ఖమ్మం జిల్లాలో రేపు విద్యాసంస్థలు బంద్

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రేపు విద్యాసంస్థల బంద్ ఉంటుందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మస్తాన్, సుధాకర్, సురేష్ తెలిపారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించకపోవడాన్ని నిరసిస్తూ రేపటి బంద్కు మద్దతు ప్రకటిస్తున్నట్లు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కులను కాల రాస్తుందని వారు పేర్కొన్నారు.
News October 17, 2025
ఖమ్మం జిల్లాలో 1,164 మద్యం టెండర్ల దరఖాస్తులు

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మద్యం టెండర్ల కోసం గురువారం నాటికి 1,164 వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా 672 దరఖాస్తులు రాగా గురువారం ఒక్క రోజే 492 దరఖాస్తులు అందాయి. ఖమ్మం ఎక్సైజ్ 1 స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాలకు 395 దరఖాస్తులు రాగా, ఖమ్మం-2 ఎక్సైజ్ స్టేషన్కు 215, నేలకొండపల్లి-90, వైరా-81, మధిర-98, సత్తుపల్లి- 247, సింగరేణి-40 దరఖాస్తులు నమోదయ్యాయి.
News October 17, 2025
ఆ ఆసుపత్రుల్లో ఆశించిన పురోగతి లేదు: ఖమ్మం కలెక్టర్

మెరుగైన సేవలతో ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల పనితీరుపై సమీక్షించారు. వైద్య విధానం పరిషత్ ఆసుపత్రులలో ప్రసవాలు జులైలో 47 నుంచి సెప్టెంబర్ 74కు చేరాయని, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ఆసుపత్రిలో మంచి ఫలితాలు రాగా, కల్లూరు, వైరా, సత్తుపల్లి , పెనుబల్లి, మధిర ఆసుపత్రులలో ఆశించిన పురోగతి లేదన్నారు.