News November 20, 2024

ప్రభుత్వం విజయోత్సవాలు.. మీకందాయా పథకాలు?

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్న సందర్భంగా విజయోత్సవాలు చేస్తోంది. అయితే 6 గ్యారంటీల్లో ఫ్రీబస్, గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్, రుణమాఫీ, ఉద్యోగాలు అమలవుతున్నా, మిగతావి ప్రజలకు అందలేదు. ఏడాది గడుస్తున్నా ఒక్క ‘ఇందిరమ్మ ఇల్లు’ కూడా ఇవ్వలేకపోయిందనే విమర్శలూ ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ విజయోత్సవాలపై మీ అభిప్రాయం ఏంటి? పథకాల్లో మీకెన్ని అందాయి? కామెంట్ చేయండి.

Similar News

News January 11, 2026

సంక్రాంతి.. YCP vs TDP

image

సంక్రాంతి వేళ ఏపీకి వస్తున్న ప్రజలు సొంతూరి దుస్థితి చూసి నిట్టూరుస్తున్నారని YCP ట్వీట్ చేసింది. గుంతల రోడ్లు, మద్దతు ధర లేక రైతులు పంటను రోడ్లపై పారేస్తున్నారని ఓ ఫొటోను షేర్ చేసింది. ఏడాదిన్నరలోనే ఇలా భ్రష్టు పట్టించేశారేంటని మాట్లాడుకుంటున్నారని పేర్కొంది. దీనికి టీడీపీ కౌంటర్ ట్వీట్ చేసింది. పోలవరం, అమరావతి వేగంగా పూర్తవుతున్నాయని, ఏపీ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని మరో ఫొటో షేర్ చేసింది.

News January 11, 2026

Bullet Train: ఆలస్యం ఖరీదు ₹88వేల కోట్లు!

image

ఇండియాలో తొలి బుల్లెట్ రైలు కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రాజెక్టు నాలుగేళ్లు ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం ఏకంగా 83% పెరిగింది. దాదాపు ₹1.1 లక్షల కోట్లతో అనుమతులు ఇవ్వగా తాజాగా ₹1.98 లక్షల కోట్లకు అంచనా పెరిగింది. ఇప్పటిదాకా ₹85,801 కోట్లు ఖర్చయ్యాయి. సూరత్, బిలిమోరా మధ్య <<18733757>>తొలి విడతలో <<>>2027 ఆగస్టులో ట్రైన్ పట్టాలెక్కనుంది. 508KM మొత్తం ప్రాజెక్టు(ముంబై-అహ్మదాబాద్) 2029 డిసెంబర్‌కు పూర్తి కానుంది.

News January 11, 2026

మెగా158.. హీరోయిన్‌గా ఐశ్వర్యరాయ్?

image

చిరంజీవి తర్వాతి మూవీ బాబీ దర్శకత్వంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇందులో చిరు సరసన ఐశ్వర్యరాయ్ నటిస్తారని సినీవర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే మెగాస్టార్‌తో మాజీ ప్రపంచసుందరి తొలిసారి నటించే అవకాశముంది. అటు ఈ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంకా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారని టాక్. ఈ సారి మెగాస్టార్ మూవీ పాన్ ఇండియా లెవల్లో ఉండనున్నట్లు తెలుస్తోంది.