News November 20, 2024

మహారాష్ట్రలోనూ ఓటేయనున్న రాష్ట్ర ఓటర్లు

image

TG: రాష్ట్రంలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని 12 గ్రామాల ప్రజలకు మహారాష్ట్రలోనూ ఓటు హక్కు ఉంది. పరందోళి, గౌరి, పద్మావతి, ముక్దంగూడ, బోటాపటార్, ఇసాపూర్, లెండిగూడ, ఇందిరానగర్, శంకర్ లొద్ది, మహారాజ్ గూడ, అంతాపూర్ ప్రజలకు రాజురా నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది. ఈ గ్రామాల్లో 3 వేలకుపైగా ఓటర్లు ఉన్నారు. కాగా రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉన్న కెరమెరి మండలం ఎప్పటి నుంచో వివాదంలో ఉంది.

Similar News

News November 20, 2024

అర్హపై అభినందనలు.. అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్

image

‘అన్‌స్టాపబుల్’లో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కూతురు అర్హ తెలుగు పద్యంతో హోస్ట్ బాలకృష్ణతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఎంతో క్లిష్టమైన ‘అటజని కాంచె’ పద్యాన్ని గుక్కతిప్పుకోకుండా చెప్పడంతో అర్హపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో తాజాగా బన్నీ ఓ పోస్ట్ చేశారు. ‘అల్లు అర్హ అంటే నాన్న కూతురు అనుకుంటివా.. నాన్న(అల్లు) యువరాణి’ అని ఇన్‌స్టాలో పేర్కొన్నారు.

News November 20, 2024

అధికారులపై స్పీకర్ అయ్యన్న ఫైర్

image

AP: అసెంబ్లీ ప్రశ్నోత్తరాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. వారి నిర్లక్ష్యంతోనే అసెంబ్లీలో గందరగోళం నెలకొందని ఆయన ఫైర్ అయ్యారు. ‘అధికారులు తమ శాఖకు వచ్చిన ప్రశ్నలను వేరే శాఖలకు ఎలా పంపుతారు? ఒకే మంత్రికి ఒకే సమయంలో రెండు సభల్లో ఎలా ప్రశ్న వేస్తారు. ప్రశ్న ఒకటి. మంత్రిత్వ శాఖ మరొకటి ఉంటుంది. మరోసారి ఇలాంటివి రిపీట్ కానివ్వొద్దు’ అని ఆయన మండిపడ్డారు.

News November 20, 2024

దేశ రాజధానిని మార్చడం సాధ్యమేనా?

image

కాలుష్య మయమైన ఢిల్లీని రాజధానిగా కొనసాగించడం అవసరమా అని కాంగ్రెస్ MP శశిథరూర్ లేవనెత్తిన ప్రశ్న చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటికే పలు కారణాలతో 8 దేశాలు తమ రాజధానులను మార్చాయి. నైజీరియా(లాగోస్-అబుజా), మయన్మార్(రంగూన్-నైపిడావ్), రష్యా(సెయింట్ పీటర్స్‌బర్గ్-మాస్కో), పాకిస్థాన్(కరాచీ-ఇస్లామాబాద్), బ్రెజిల్(రియో డి జనీరో-బ్రెసిలియా), కజకిస్థాన్, టాంజానియా, ఐవరీ కోస్ట్ సైతం తమ రాజధాని నగరాలను మార్చాయి.