News November 20, 2024
శ్రీకాకుళంలో 22న జాబ్ మేళా
ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాలకు ఈ నెల 22న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు DRDA PD కిరణ్ కుమార్ తెలిపారు. RTC కాంప్లెక్స్ వెనక నెహ్రూ యువ కేంద్రంలో ఉ.9 నుంచి సా.4.30 వరకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. రిలేషన్షిప్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్, బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్ పోస్టులకు B.Com/MBA అర్హత, 18-28 ఏళ్ల వయసు, ఆసక్తి గలవారు హాజరు కావాలన్నారు. 16,000 నుంచి 25,000 జీతం మని, మన జిల్లాలోనే పనిచేయాలన్నారు. SHARE IT
Similar News
News November 21, 2024
పీయూసీ కమిటీలో కూన రవికుమార్‌కు ఛాన్స్..!
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పీయూసీ ఛైర్మన్‌గా ఎన్నికైయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తారని పేరుంది. 2024 ఎన్నికల్లో కూన రవికుమార్ తమ్మినేని సీతారాం పైన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీలో ఛైర్మన్‌గా పేరు ప్రతిపాదనలో నిలిచింది. రేపు అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఈ ఎన్నిక జరగనుంది.
News November 21, 2024
SKLM: గృహ నిర్మాణ లక్ష్యాలను సాధించాలి
ప్రణాళికాబద్ధంగా జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గృహ నిర్మాణశాఖ అధికారులకు స్పష్టం చేశారు. గృహ నిర్మాణ శాఖకు నిర్దేశించిన లక్ష్యాలు, ప్రగతిపై కలెక్టరేట్‌లో గురువారం సమావేశంలో నిర్వహించారు. ప్రభుత్వం గృహ నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, జిల్లాలో 100 రోజుల వ్యవధిలో 5 వేల గృహాలు, ఏడాదిలోపు 35 వేల గృహాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు.
News November 21, 2024
గార: విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న స్కూటీ.. ఒకరు మృతి
గార మండలం వమరవిల్లి ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభాన్ని స్కూటీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలకు వెళితే స్థానిక మండలం తోనంగి గ్రామానికి చెందిన కృష్ణారావు, గణేశ్ గురువారం మధ్యాహ్నం స్కూటీతో అతివేగంతో వెళుతూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ తాకిడికి విద్యుత్ స్తంభం నేలకు ఒరిగింది. ఈ ప్రమాదంలో కృష్ణారావు అక్కడికక్కడే మృతి చెందాడు.