News November 20, 2024
తూ.గో: ‘బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు’

సారా అమ్మకాలు, బెల్ట్ షాప్‌లు, పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తూ.గో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాల నిర్మూలనకు తాము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నేరాలకు పాల్పడిన వారిన ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని ఈ సందర్భంగా చెప్పారు. తాళ్లపూడి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన అనంతరం మాట్లాడారు.
Similar News
News April 18, 2026
నిడదవోలులో ఈనెల 18న సీఎం పర్యటన

సీఎం చంద్రబాబు శనివారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిషోర్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలను సందర్శించి భద్రతా పరమైన సూచనలు చేశారు. సీఎం రాకపోకల సమయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలన్నారు.

News April 17, 2026
సెన్సస్–2027: స్వీయ నమోదును వినియోగించుకోండి: కలెక్టర్

జనగణన (సెన్సస్–2027)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కల్పించిన స్వీయ నమోదు అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రజలు తమ కుటుంబ వివరాలను [https://se.census.gov.in](https://se.census.gov.in) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.