News November 20, 2024

నెల్లిమర్ల జూట్ మిల్లు తెరిచేదెప్పుడు?

image

నెల్లిమర్ల జూట్ మిల్లుకు ఘనమైన చరిత్ర ఉంది. 1920లో మిల్లు ప్రారంభం కాగా అప్పట్లో సమీప 45 గ్రామాలకు చెందిన సుమారు 11వేల మంది కార్మికులు ఉపాధి పొందేవారు. తరచూ మిల్లు మూతబడటంతో ఆ సంఖ్య నేటికి 2వేలకు పడిపోయింది. జూట్ కొరతతో మిల్లును నడపలేకపోతున్నామని యాజమాన్యం చెబుతోంది. ఆరు నెలల క్రితం మిల్లు లాకౌట్ ప్రకటించడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై నిన్న శాసన మండలిలో చర్చకు వచ్చింది.

Similar News

News November 20, 2024

VZM: ‘ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరి’

image

మరుగుదొడ్డి అనేది ఆత్మ గౌరవానికి చిహ్నమని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలని, లేని వారికీ వెంటనే మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంలో భాగంగా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అంతటా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

News November 19, 2024

VZM: ‘సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకు అధికారులు బాధ్యత వహించాలి’

image

జిల్లాలో నమోదవుతున్న సైబరు మోసాల నియంత్రణకు బ్యాంకు అధికారులు కూడా బాధ్యత వహించాలని, సైబరు కేసులను దర్యాప్తు చేసే పోలీసు అధికారులకు తమ సహాయ, సహకారాలను అందించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కొత్తగా బ్యాంకు ఖాతాను ప్రారంభించే సమయంలో వారి గుర్తింపు కార్డులను పూర్తిగా వెరిఫై చేసిన తరువాతనే బ్యాంకు ఖాతా ప్రారంభమయ్యే విధంగా చూడాలన్నారు.

News November 19, 2024

VZM: ‘నెలలు నిండకుండా పుట్టిన పిల్ల‌ల‌కు కంటి ప‌రీక్ష‌లు చేయించాలి’

image

నెల‌లు నిండ‌కుండా పుట్టిన పిల్ల‌ల్లో దృష్టిలోపాలు వచ్చే అవకాశాలు ఉంటాయని అందువల్ల అటువంటి వారికి కంటి పరీక్షలు చేయించడంలో తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. ప్రపంచ ప్రి మెచ్యూరిటీ డే నడకను కలెక్టరేట్ వద్ద మంగళవారం ప్రారంభించారు. దేశంలో ప్రతి ఏటా 3.6 మిలియ‌న్ల పిల్ల‌లు నెల‌లు నిండ‌కుండా పుడుతున్నార‌ని, వారికి కంటి ప‌రీక్ష‌లు తప్పనిసరన్నారు.