News November 20, 2024
రోడ్డు ప్రమాదాలు.. గంటకు 20 మంది మృతి
దేశంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రవాణాశాఖ విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. 2023లో 4.80 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.72 లక్షల మంది చనిపోయారని తెలిపింది. సగటున గంటకు 20 మంది చనిపోయారు. 4.62 లక్షల మంది గాయపడ్డారు. 2022తో పోల్చుకుంటే మృతులు, గాయాలపాలైన వారి సంఖ్య పెరిగింది. అత్యధికంగా UPలో 23,652 మంది, TNలో 18,347 మంది, MHలో 15,366 మంది చనిపోయారు. అటు అత్యధికంగా TNలో 67,213 ప్రమాదాలు జరిగాయి.
Similar News
News November 20, 2024
RECORD: బిట్‌కాయిన్ @ రూ.80లక్షలు
క్రిప్టో కరెన్సీ రారాజు బిట్‌కాయిన్ రికార్డులను తిరగరాస్తోంది. తొలిసారి $94000ను టచ్ చేసింది. భారత కరెన్సీలో ఈ విలువ రూ.80లక్షలకు చేరువగా ఉంటుంది. క్రిప్టో ట్రేడింగ్ కంపెనీ Bakktను డొనాల్డ్ ట్రంప్ మీడియా సంస్థ కొనుగోలు చేయనుందన్న వార్తలే దీనికి కారణం. పైగా ఆయన క్రిప్టో ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తారన్న అంచనాలూ పాజిటివ్ సెంటిమెంటును పెంచాయి. ప్రస్తుతం BTC $92000 వద్ద చలిస్తోంది.
News November 20, 2024
సింగిల్స్‌కు చైనా కంపెనీ బంపరాఫర్
సింగిల్‌గా ఉన్న తమ ఉద్యోగులకు ఓ చైనా కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. షెన్ జెన్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీ తమ ఉద్యోగులు డేట్‌కు వెళ్తే నగదు బహుమతి ఇస్తోంది. కంపెనీలోని సింగిల్స్‌కు డేటింగ్ ఖర్చుల కోసం రూ.770 అందిస్తోంది. ఒకవేళ డేటింగ్లో ఉంటే ఇద్దరికీ చెరో రూ.11,650 ఇస్తోంది. పెళ్లిళ్లు చేసుకోకపోవడం, తద్వారా జనాభా తగ్గుతుండటంతో చైనా ప్రభుత్వంతోపాటు అక్కడి కంపెనీలు వినూత్న ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
News November 20, 2024
ఎగ్జిట్ పోల్స్ ఎక్స్‌క్లూజివ్‌గా వే2న్యూస్‌లో
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఈ సాయంత్రం గం.6 తర్వాత విడుదల కానున్నాయి. వీటితో పాటు రాహుల్ రిజైన్తో అనివార్యమైన వయనాడ్ బైపోల్ అంచనా ఫలితాలనూ మీడియా సంస్థలు వెల్లడించనున్నాయి. అన్ని ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్‌ను మీరు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఎక్స్‌క్లూజివ్‌గా వే2న్యూస్‌లో తెలుసుకోవచ్చు. ఒక్క ఫ్లిప్‌తో సర్వే ఫలితాలన్నీ మీకు అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.