News November 20, 2024
మెడికల్ షాపుల్లో ఈ మందులు కొంటున్నారా?
కొందరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఫార్మసీల్లో మందులు కొంటుంటారు. అయితే సరైన అవగాహన లేకుండా యాంటీబయాటిక్స్ వాడితే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకుంటే అవి యాంటీబయాటిక్‌లా కాదా అని అడిగి తెలుసుకోండి. ఒకవేళ యాంటీబయాటిక్ కేటగిరీకి చెందినవైతే వద్దని చెప్పండి. యాంటీబయాటిక్ వాడాలనుకుంటే డాక్టర్ సూచన తీసుకోవడం మంచిది.
Similar News
News November 28, 2024
నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ సంతోష్ కుమార్ ఆయనచే ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ఖర్గే, రాహుల్ గాంధీ, మమతాతో సహా ఇండియా కూటమి నేతలు హాజరుకానున్నారు. మిత్ర పక్షం కాంగ్రెస్ నుంచి మంత్రుల విషయమై క్లారిటీ వచ్చాక మంత్రివర్గం కొలువుదీరనుంది. JMMకు ఆరు, కాంగ్రెస్‌కు 4, రాష్ట్రీయ జనతా దళ్‌కు ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
News November 28, 2024
వచ్చే నెలాఖరు నాటికి బీజేపీ కొత్త చీఫ్: కిషన్ రెడ్డి
TG: డిసెంబర్ చివరి నాటికి తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్‌ను ఎన్నుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మోదీతో రాష్ట్ర నేతల సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని ప్రధాని సూచించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విపక్షాలను తిట్టడం ఆపేసి పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే.
News November 28, 2024
కొత్త సినిమా మొదలుపెట్టిన సూర్య
హీరో సూర్య కొత్త సినిమాను మొదలుపెట్టారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సూర్య45’ పూజా కార్యక్రమం నిన్న జరిగింది. ఈ సినిమాకు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతగా వ్యవహరించనుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించనున్నారు. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రానున్న ‘సూర్య 44’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘కంగువా’ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.