News November 20, 2024
అమెరికాలోని సగం విద్యార్థులు తెలుగోళ్లే..!
అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 56 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారేనని హైదరాబాద్‌లోని US కాన్సులేట్ జనరల్ కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్ తెలిపారు. వీరిలో AP నుంచి 22 శాతం, TG నుంచి 34 శాతం మంది ఉన్నారు. USలో మొత్తం 3.3 లక్షల మంది భారత విద్యార్థులు ఉండగా లక్షన్నరకుపైగా మనవాళ్లే. ప్రస్తుతం రోజుకూ 1,600 వీసాలు జారీ చేస్తున్నారు. అలాగే 8 వేల మంది అమెరికన్లు భారత్‌లో చదువుతున్నారు.
Similar News
News November 28, 2024
నేడు ఎంపీగా ప్రియాంక ప్రమాణస్వీకారం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ నేడు పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. వయనాడ్ ఉపఎన్నికలో గెలిచిన ఆమె నేడు ఎంపీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తల్లి సోనియా రాజ్యసభ ఎంపీగా ఉండగా సోదరుడు రాహుల్ లోక్‌సభ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన వయనాడ్ ఉపఎన్నికలో రికార్డు స్థాయిలో 4,10,931 ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రియాంక చరిత్ర సృష్టించారు.
News November 28, 2024
బ్రష్ చేసిన వెంటనే తింటున్నారా?
చాలా మంది బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ చేస్తుంటారు. వెంటనే తింటే నోటిలో సలైవా ఉత్పత్తి తగ్గి జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. నోటిలోని Ph స్థాయి ఆల్కలైన్‌గా మారుతుంది. ఇది ఆహార పదార్థాలను కొంతసేపటి వరకు జీర్ణం కాకుండా చేస్తుంది. దీంతో ఆహార పదార్థాల రుచిని నాలుక గుర్తించలేదు. టూత్‌పేస్ట్‌లో ఉండే కొన్ని కెమికల్స్ నోటి రుచిని తాత్కాలికంగా మార్చివేస్తాయి. అందుకే బ్రష్ చేసిన 10-15 నిమిషాల తర్వాత తినడం ఉత్తమం.
News November 28, 2024
జైస్వాల్ 40కి పైగా సెంచరీలు చేస్తాడు: మ్యాక్సీ
భారత యంగ్ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ టెస్టుల్లో 40కి పైగా సెంచరీలు చేస్తారని ఆస్ట్రేలియన్ ప్లేయర్ మ్యాక్స్‌వెల్ జోస్యం చెప్పారు. ఆస్ట్రేలియా జట్టు అతడిని ఆపకుంటే ఈ సిరీస్ మరింత భయంకరంగా ఉంటుందన్నారు. భిన్న పరిస్థితులను అర్థం చేసుకునే గొప్ప సామర్థ్యాన్ని ఈ కుర్రాడు కలిగి ఉన్నాడని మ్యాక్సీ ప్రశంసించారు. ఇప్పటివరకు 15 టెస్టులు ఆడిన జైస్వాల్ 4 సెంచరీలు చేశారు. అన్నింట్లోనూ 150+ పరుగులు చేయడం గమనార్హం.