News November 20, 2024
కోహ్లీ ఆట చూడాలని ఉంది: అక్తర్

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆటను చూసేందుకు యావత్ పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తెలిపారు. కోహ్లీ తొలిసారి పాక్ గడ్డపై అడుగుపెట్టాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘విరాట్ పాక్ గడ్డపై సెంచరీ చేస్తే ఎలా ఉంటుందో ఊహించలేం. ఇక్కడ ఆడితే ఆయన క్రికెట్ జీవితం పరిపూర్ణం అవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు చివరి క్షణంలోనైనా భారత్ ఇక్కడికి వస్తుందేమో చూడాలి’ అంటూ పేర్కొన్నారు.
Similar News
News January 17, 2026
ముక్కనుమ రోజు మాంసాహారం తినవచ్చా?

భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్లో శాకాహారానికే ప్రాధాన్యతనిచ్చే ప్రజలు నాలుగో రోజైన ముక్కనుమ నాడు మాంసాహారాన్ని ఇష్టంగా వండుకుంటారు. అందుకే దీనిని వాడుక భాషలో ముక్కల పండుగ అని పిలుస్తారు. ఈ రోజున గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి, ఆపై బంధుమిత్రులతో కలిసి విందు భోజనాలు చేయడం తరతరాలుగా వస్తున్న ఆచారం. శాస్త్రపరంగా దీనికి అభ్యంతరం లేదు కాబట్టి, పల్లెల్లో ప్రతి ఇంటా ముక్కనుమ విందు ఘనంగా జరుగుతుంది.
News January 17, 2026
రూ.13 వేల కోట్ల ప్రాజెక్ట్.. నేడే శంకుస్థాపన

AP: రాష్ట్రంలో రూ.13,000 కోట్ల పెట్టుబడితో 495 ఎకరాల్లో కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకి నేడు CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా 2,600 మందికి ఉపాధి దక్కనుంది. దీనిని AM గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తుండగా ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్ను గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కానుంది.
News January 17, 2026
WCలో బంగ్లాదేశ్.. నేడు క్లారిటీ

T20 WCలో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనడంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు <<18871702>>ఐసీసీ<<>> రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. భద్రతా కారణాలతో ముంబై, కోల్కతాలో తమ మ్యాచ్లు నిర్వహించవద్దని BCB కోరుతోంది. ఈ నేపథ్యంలో ICCకి చెందిన ఇద్దరు అధికారులు నేడు ఢాకాలో పర్యటించి BCB ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. దీంతో ఈ విషయంలో నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


