News November 20, 2024

శాసనమండలిలో మంత్రి గొట్టిపాటి ఫైర్

image

శానసమండలిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ గత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మిగులు విద్యుత్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ రంగం సంక్షోభంలో చిక్కుకుందన్నారు.అవగాహన, ముందు చూపు లేని సీఎం వల్ల విద్యుత్ శాఖలో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు, పెరగనున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా అడుగులేస్తోందన్నారు.

Similar News

News September 15, 2025

పూర్వ ఎస్పీ దామోదర్‌కు ఘనంగా వీడ్కోలు

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం ఎస్పీ దామోదర్‌కు వీడ్కోలు సభను జిల్లా పోలీస్ అధికారులు నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎస్పీ దామోదర్ జిల్లాకు అందించిన సేవలను పలువురు పోలీస్ అధికారులు కొనియాడారు. అనంతరం ఎస్పీ దామోదర్‌ను పోలీస్ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

News September 14, 2025

ఒంగోలు MP మాగుంటకు రెండవ ర్యాంక్

image

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో ఒంగోలు MP మాగుంట శ్రీనివాసులురెడ్డి 2వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 84 ప్రశ్నలు అడగటంతోపాటు 6 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు 73.53 శాతంగా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.

News September 14, 2025

ప్రకాశం కలెక్టర్, SP వచ్చేశారు.. రేపే తొలి మీకోసం.!

image

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజబాబు, ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు చేపట్టారు. ఇటీవల కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్‌లు బదిలీ కాగా, వారి స్థానంలో వీరు బాధ్యతలు చేపట్టారు. కాగా తొలిసారి జిల్లా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు సోమవారం ‘‘మీకోసం కార్యక్రమానికి’’ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంతో ప్రజల ముందుకు ఇద్దరూ ఉన్నతాధికారులు రానున్నారు.