News November 20, 2024
రామ్ పోతినేని సరసన భాగ్యశ్రీ బోర్సే

రామ్ పోతినేని హీరోగా ‘RAPO22’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించనున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా తెలిపారు. కాగా ఈ చిత్రాన్ని పి.మహేశ్ బాబు తెరకెక్కించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. రేపు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత ఈ మూవీపై అప్డేట్స్ వస్తాయని సమాచారం.
Similar News
News November 11, 2025
చక్కటి కురులకు చక్కెర స్నానం

చక్కెరను వంటకాల్లో ఎక్కువగా వాడతారు. మరికొందరు చర్మ సౌందర్యం కోసం స్కిన్‌పై కూడా అప్లై చేస్తారు. అయితే, చక్కెర జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
షాంపూలో టీ స్పూన్ పంచదార వేసి ఈ మిశ్రమంతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చక్కెరతో తలస్నానం చేయడం వల్ల తలలో పేరుకుపోయిన మురికి పోతుంది. అలాగే జుట్టురాలడం, చుండ్రు, జుట్టు చిట్లడం, తలలో దురద వంటి సమస్యలు తగ్గుతాయి.
News November 11, 2025
ఏపీ అప్డేట్స్

☛ రబీలో ప్రధానమంత్రి పంట బీమా పథకం(PMFBY) అమలుకు రూ.44.06 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
☛ MBBS రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదల.. రీకౌంటింగ్‌కు ఈ నెల 17 వరకు అవకాశం
☛ కల్తీ నెయ్యి కేసులో YCP నేత వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ
☛ పింగళి వెంకయ్య, బ్రౌన్‌ల జయంతులను రాష్ట్ర పండగలుగా నిర్వహించాలని సీఎం చంద్రబాబుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లేఖ
News November 11, 2025
డేవిడ్ సలయ్‌కి ‘బుకర్ ప్రైజ్’

కెనడియన్-హంగేరియన్ రచయిత డేవిడ్ సలయ్‌ను ఈ ఏడాది ‘బుకర్ ప్రైజ్’ వరించింది. సాధారణ మనిషి జీవితం ఆధారంగా ఆయన రాసిన ‘ఫ్లెష్’ నావెల్‌కిగానూ ఈ పురస్కారం దక్కింది. 51 ఏళ్ల డేవిడ్ ఫైనల్లో ఐదుగురు రచయితలను వెనక్కినెట్టారు. వీరిలో ఇండియన్ మహిళా రచయిత కిరణ్ దేశాయ్ కూడా ఉన్నారు. ఆమె రాసిన ‘లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ పుస్తకం బుకర్ దక్కించుకోలేకపోయింది.


