News November 20, 2024

జీవితంలో పెళ్లి చేసుకోను: ఐశ్వర్య లక్ష్మి

image

మ్యారేజీపై తన ఒపీనియన్‌ను మార్చుకున్నారు నటి ఐశ్వర్య లక్ష్మి. జీవితంలో పెళ్లి చేసుకోనని, బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ‘హలో మమ్మీ’ ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. ‘25ఏళ్ల వయసులో వివాహం చేసుకోవాలనుకున్నా. ఓ మ్యాట్రిమోనిలో ప్రొఫైల్ కూడా పెట్టా. కానీ కొన్నాళ్లకు నా అభిప్రాయం మారింది. పెళ్లి చేసుకున్న వారందరూ రాజీపడి బతుకుతున్నారు. వ్యక్తిగతంగానూ ఎదగలేకపోతున్నారు’ అని చెప్పుకొచ్చారు.

Similar News

News November 20, 2024

UNSC 1945లో ఉండిపోయింది: భారత్

image

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి(UNSC) మారుతున్న కాలంతో పాటు ముందుకెళ్లడం మరచిపోయిందని భారత్ విమర్శించింది. ప్రగతి విషయంలో అత్యంత నెమ్మదిగా వ్యవహరిస్తోందని పేర్కొంది. ‘UNSC ప్రస్తుత పనితీరు 1945 నాటిదే. నేటి వాస్తవికతకు ఏమాత్రం దగ్గరగా లేదు. సహాయంలో UN అద్భుతమే. కానీ ఉద్రిక్తతల్ని కంట్రోల్ చేయడంలో మాత్రం విఫలమవుతోంది. సంస్థలో సంస్కరణలు అత్యవసరం’ అని UNలో భారత రాయబారి పర్వతనేని హరీశ్ వ్యాఖ్యానించారు.

News November 20, 2024

కరోనా కల్లోలంలోనూ చంద్రబాబు కంటే తక్కువ అప్పులు: జగన్

image

AP: చంద్రబాబు హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు 19.54 శాతం ఉంటే, తమ పాలనలో 13.57 శాతం మాత్రమేనని వైఎస్ జగన్ చెప్పారు. కొవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గిపోయినా పరిమితికి లోబడే అప్పులు చేశామని తెలిపారు. కరోనా కల్లోలంలో దేశ వృద్ధి రేటు కూడా పడిపోయిందని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో 11వ స్థానంలో ఉన్న రాష్ట్ర పారిశ్రామిక రంగం వైసీపీ పాలనలో 9వ స్థానానికి చేరిందని పేర్కొన్నారు.

News November 20, 2024

చంద్రబాబు బకాయిలు రూ.42,183కోట్లు మేం కట్టాం: జగన్

image

AP: 2014-19 మధ్య చంద్రబాబు FRBM పరిధి దాటి రూ.28,457 కోట్ల అప్పు చేశారని వైఎస్ జగన్ వెల్లడించారు. తమ హయాంలో ఆ మొత్తం రూ.16,047 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఇవన్నీ RBI, కాగ్ వెల్లడించిన గణాంకాలని చెప్పారు. ఎవరు విధ్వంసకారులో ఈ లెక్కలే చెబుతున్నాయన్నారు. చంద్రబాబు దిగిపోతూ పలు రంగాల్లో రూ.42,183 కోట్ల బకాయిలను తమకు గిఫ్ట్ ఇచ్చారని, ఆ మొత్తాన్ని తాము చెల్లించామని పేర్కొన్నారు.