News November 20, 2024
HYD: ఇల్లు కట్టుకునే వారికి GOOD NEWS

గ్రేటర్ HYDలో ఇల్లు కట్టుకునే వారికి జలమండలి శుభవార్త తెలిపింది. బిల్డింగ్ పర్మిషన్ కోసం కావాల్సిన వాటర్ ఫీజిబిలిటీ పత్రాన్ని ఇకనుంచి డైరెక్ట్‌గా ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి జారీ చేయనున్నట్లు పేర్కొంది. గతంలో స్థానిక CGM కార్యాలయాలలో జారీ చేసేవారు. కానీ వివిధ కారణాలతో తీవ్ర జాప్యం జరిగేది. దీంతో బిల్డింగ్ నిర్మాణానికి ఆలస్యం అయ్యేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని MD అశోక్ రెడ్డి తెలిపారు.
Similar News
News April 16, 2026
HYD: కస్టమర్ కేర్ నం. డౌన్.. ఇలా బుక్ చేయండి!

నగరవాసులకు చిన్న అలర్ట్! మీరు ఎప్పుడూ ఫోన్ చేసే జలమండలి కస్టమర్ కేర్ నం.155313 ప్రస్తుతం మొరాయిస్తోంది. IVRSలో సాంకేతిక లోపంతో లైన్ కలవడం లేదు. అర్జెంట్‌గా నీళ్లు కావాలంటే వెంటనే HMWSSB వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ అవ్వండి. ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే నిమిషాల్లో బుకింగ్ అయిపోతుంది. అసలే వేసవి, అవసరమైన వారికి ఈ విషయం చెప్పండి.
News April 16, 2026
HYD: మత్తుకు బానిసయ్యారా? ఇక్కడికి తీసుకురండి

మత్తుకు బానిసైన వారికి విముక్తి కల్పించడం కోసం ప్రభుత్వం డీ అడిక్షన్ సెంటర్లను ప్రారంభించింది. HYD గాంధీ ఆసుపత్రిలోనూ సెంటర్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సేవలు ప్రారంభమయ్యాయి. మద్యం, గంజాయి, సిగరెట్ ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారటంతో వ్యక్తిగత జీవితంతో పాటు, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాటి నుంచి విముక్తి కల్పించడం కోసం చర్యలు చేపట్టారు.
News April 15, 2026
మూసీ ప్రక్షాళనకు మహర్దశ

ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా రూ.98.99 లక్షలతో ప్రక్షాళన పనులు వేగవంతం కానున్నాయి. చార్మినార్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క, వ్యర్థాలను తొలగించి, నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం అత్యాధునిక హైడ్రాలిక్ ఎక్స్‌కవేటర్లను (హిటాచీ), కూలీలను రంగంలోకి దించుతున్నారు. ముసీ పునరుజ్జీవనంతో నగరానికే కొత్త కళ రానుంది.


