News November 20, 2024

పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

image

TG: వికారాబాద్(D) లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసులో A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. నరేందర్‌రెడ్డి అరెస్టు విధానాన్ని కోర్టు తప్పుబట్టింది. ఆయన పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. వాకింగ్‌కు వెళ్లిన ఓ మాజీ ఎమ్మెల్యేను ఉగ్రవాదిలా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. తీర్పును రిజర్వ్ చేసింది.

Similar News

News November 5, 2025

సంతానలేమిని నివారించే ఖర్జూరం

image

ఖర్జూరాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయని.. మగవారిలో సంతానలేమి సమస్యను నివారించడంలో ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. వీటిలో ఉన్న పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఖర్జూరాల్లో అధికంగా ఉండే పీచు జీర్ణ ప్రక్రియకు మంచిది. ఇందులోని కెరోటనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఐరన్, విటమిన్ C, D, విటమిన్ B కాంప్లెక్స్ గర్భిణులకు మంచివని చెబుతున్నారు.

News November 5, 2025

SSC-కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఫలితాలు రిలీజ్

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) 552 గ్రూప్-B కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు సంబంధించి ఫలితాలు విడుదల చేసింది. ఆగస్టు 12న పేపర్ 1 పరీక్షను నిర్వహించగా.. పేపర్ 2 పరీక్షకు 3,642మంది క్వాలిఫై అయ్యారు. కటాఫ్ మార్కులను వెబ్‌సైట్‌లో పెట్టింది. పేపర్ 2 పరీక్ష షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనుంది. వెబ్‌సైట్: https://ssc.nic.in/

News November 5, 2025

రేపే బిహార్ తొలిదశ పోలింగ్

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారానికి నిన్నటితో తెరపడింది. 18 జిల్లాల పరిధిలోని 121 సెగ్మెంట్లలో రేపు పోలింగుకు ఈసీ ఏర్పాట్లన్నీ పూర్తిచేసింది. ఈ దశలో 8 మంది మంత్రులతోపాటు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు, JJL పార్టీ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా ఈ నెల 11న మరో 122 స్థానాల్లో పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది.