News November 20, 2024
RECORD: బిట్‌కాయిన్ @ రూ.80లక్షలు

క్రిప్టో కరెన్సీ రారాజు బిట్‌కాయిన్ రికార్డులను తిరగరాస్తోంది. తొలిసారి $94000ను టచ్ చేసింది. భారత కరెన్సీలో ఈ విలువ రూ.80లక్షలకు చేరువగా ఉంటుంది. క్రిప్టో ట్రేడింగ్ కంపెనీ Bakktను డొనాల్డ్ ట్రంప్ మీడియా సంస్థ కొనుగోలు చేయనుందన్న వార్తలే దీనికి కారణం. పైగా ఆయన క్రిప్టో ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తారన్న అంచనాలూ పాజిటివ్ సెంటిమెంటును పెంచాయి. ప్రస్తుతం BTC $92000 వద్ద చలిస్తోంది.
Similar News
News January 16, 2026
మళ్లీ తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. 10 రోజులు జాగ్రత్త!

TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ చలి తీవ్రత పెరగనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు వెస్ట్ తెలంగాణలో ఇవాళ రాత్రి సగటు ఉష్ణోగ్రతలు 12-14 డిగ్రీలుగా నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. రాబోయే 10 రోజులు ఈ తరహా వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు 29-30 డిగ్రీలుగా ఉంటాయని వెల్లడించారు.
News January 16, 2026
ప్రజల నమ్మకానికి నిదర్శనం.. ముంబై రిజల్ట్స్‌పై అమిత్ షా

దేశం దృష్టిని ఆకర్షించిన BMC ఎన్నికల్లో BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం దాదాపు ఖరారైంది. 227 వార్డులకుగానూ 129 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 72 స్థానాలతో ఠాక్రే సోదరుల కూటమి తర్వాతి స్థానంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 15 సీట్లలోనే ప్రభావం చూపుతోంది. NDA ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, విధానాలపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
News January 16, 2026
ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: లోకేశ్

AP: రాష్ట్రానికి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ‘AM గ్రీన్’ కంపెనీ కాకినాడలో 1.5 మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎక్స్‌పోర్ట్ టర్మినల్ ఏర్పాటు చేయబోతుందని, దీనివల్ల 8వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని ట్వీట్ చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయిన అమ్మోనియాను జపాన్, జర్మనీ, సింగపూర్‌కు ఎగుమతి చేస్తారని పేర్కొన్నారు.


