News November 20, 2024

ICC ర్యాంకింగ్స్‌లో టాప్-3కి తిలక్ వర్మ

image

తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ICC T20I ర్యాంకింగ్స్‌లో రయ్యుమని దూసుకెళ్లారు. ఒకేసారి ఏకంగా 69 స్థానాలు ఎగబాకి టాప్3కి చేరుకున్నారు. టాప్‌1లో ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా) ఉండగా 2వ స్థానంలో సాల్ట్(ఇంగ్లండ్) ఉండగా ఆ తర్వాతి స్థానాన్ని తిలక్ కైవసం చేసుకున్నారు. అరంగేట్రం తర్వాత కేవలం 20 మ్యాచుల్లో తిలక్ ఈ ఫీట్ అందుకోవడం విశేషం. ఇటీవల SAపై వరుస సెంచరీలు చేసిన వర్మ మొత్తం 51.33 సగటుతో 616 రన్స్ చేశారు.

Similar News

News December 27, 2025

విపత్తులతో ₹10.77 లక్షల కోట్ల నష్టం

image

2025లో ప్రకృతి విపత్తులతో ప్రపంచం వణికింది. హీట్‌వేవ్స్, కార్చిచ్చు, వరదల వల్ల సుమారు ₹10.77 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఒక రిపోర్ట్ వెల్లడించింది. శిలాజ ఇంధనాల వాడకం, క్లైమేట్ చేంజ్ వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయని హెచ్చరించింది. USలోని కాలిఫోర్నియా ఫైర్స్ వల్ల ఏకంగా ₹5.38 లక్షల కోట్ల నష్టం వచ్చింది. ఆసియాలో తుపాన్లు, వరదలతో వేలమంది చనిపోయారు.

News December 27, 2025

మహాత్ముడి పేరుతో వచ్చిన పథకాన్ని కాపాడుకోవాలి: రేవంత్

image

TG: జనవరి 5 నుంచి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం బచావో కార్యక్రమం చేపట్టాలని CWC సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. పలు ప్రయోజనాలతో తీసుకొచ్చిన పథకాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండించినట్లు Xలో రాసుకొచ్చారు. మహాత్ముడి పేరుతో తీసుకువచ్చిన ఈ పథకాన్ని కాపాడుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

News December 27, 2025

అల్లు అర్జున్‌ను మళ్లీ అరెస్ట్ చేస్తారా?

image

‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటనపై పోలీసులు <<18684964>>ఛార్జ్‌షీట్<<>> దాఖలు చేయడంపై మరోసారి హీరో అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనను ఏ-11గా పేర్కొనడంతో బన్నీని మళ్లీ అరెస్ట్ చేస్తారా? అని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఛార్జ్‌షీట్ అనేది కేసు పూర్తి వివరాలతో కోర్టుకు సమర్పించే నివేదిక. ఇక్కడ సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు అందులో పేర్కొనడంతో బన్నీ అరెస్ట్ ఉండకపోవచ్చు!