News November 20, 2024

వరాహ పుష్కరిణి వద్ద పోలిపాడ్యమికి ఏర్పాట్లు 

image

డిసెంబర్ 2న జరిగే పోలిపాడ్యమికి సింహాచలం వరాహ పుష్కరిణి వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సింహాచలం ఈవో త్రినాథరావు తెలిపారు. వరాహ పుష్కరిణిలో దీపాలు వదిలేందుకు మహిళలు ఎక్కువగా రానున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పుష్కరిణి వద్ద బారికేడింగ్ ఏర్పాట్లు చేశారు. పుష్కరిణికి మార్గంలో పోలీసులతోను బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తోలిపావంచ వద్ద ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేస్తామన్నారు.

Similar News

News January 21, 2026

విశాఖ: 15 ఏళ్లు దాటాయా.. లాస్ట్ ఛాన్స్

image

పదిహేను సంవత్సరాలు దాటినా ఇంకా జనన రిజిస్టర్‌లో నమోదు చేసుకోలేదా. రిజిస్ట్రేషన్‌కు నేటితో సమయం ముగియనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జీవీఎంసీ పరిధిలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల పేరు జనన రిజిస్టర్‌లో చేసుకునేందుకు జనవరి 21వరకు మాత్రమే అవకాశం ఇచ్చింది. దీని కోసం అన్ని జోనల్ కార్యాలయాల్లోని జనన రిజిస్టర్ అధికారుల వద్ద అవకాశం కల్పించారు. ఒకవేళ చేయించుకోకపొతే వేంటనే చేయించుకోండి.

News January 21, 2026

24 నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్‌కు 3 ఏసీ బోగీలు

image

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే దురంతో ఎక్సప్రెస్ రైలుకు 3AC మూడేసి అదనంగా జత చేస్తున్నట్లు ప్రకటించారు. (22203/22204) నంబర్లు గల ఈ రైలు 24, 25వ తేదీల నుంచి ప్రయాణికులకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ అదనపు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

News January 21, 2026

స్టీల్ ప్లాంట్‌లో VRSకి గడువు పెంపు

image

స్టీల్ ప్లాంట్లో VRSకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. VRS దరఖాస్తుల గడువును ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ ప్లాంట్ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది DEC 24న విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం VRSకి ఈ నెల 20వ తేదీలోగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ఉద్యోగుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో గడువును పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 500 దరఖాస్తులు అందినట్లు సమాచారం.