News November 20, 2024

సిరిసిల్ల: రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

image

సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.236 కోట్లతో మానేరు రిజర్వాయర్‌భూ నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం. రూ.166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో నిర్మాణం, రూ.కోటి 45 లక్షలతో గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకు స్థాపన చేశారు.

Similar News

News February 1, 2026

కొత్తగట్టు: కన్నులపండువగా మత్స్య గిరీంద్రుడి బ్రహ్మోత్సవాలు

image

శంకరపట్నం మండలం కొత్తగట్టులోని మత్స్య గిరీంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో వైభవంగా జరుగుతున్నాయి. పౌర్ణమి జాతర పురస్కరించుకుని ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భరతనాట్య ప్రదర్శనలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ వేడుకల్లో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రాజిరెడ్డి, మాజీ చైర్మన్ మల్లారెడ్డి తదితరులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

News February 1, 2026

ఇంటర్ ప్రాక్టికల్స్.. కరీంనగర్ జిల్లాలో 60 కేంద్రాలు

image

రేపటి నుంచి కరీంనగర్ జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 17,257 మంది విద్యార్థుల కోసం 60 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు RIO వి.గంగాధర్ తెలిపారు. హాల్ టికెట్లు తప్పనిసరిగా ఇవ్వాలని, ఇవ్వకపోతే ప్రైవేట్ కాలేజీలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని హైదరాబాద్ కార్యాలయం నుంచి నేరుగా పర్యవేక్షిస్తారు.

News February 1, 2026

ప్రజావాణి రద్దు: కరీంనగర్ కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కోడ్ ముగిసే వరకు ప్రజల నుంచి వినతుల స్వీకరణ ఉండదని, ఆ తర్వాతే యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మార్పును జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.