News November 20, 2024

CM రేవంత్‌కు KCR భయం పట్టుకుంది: హరీశ్

image

TG: CM రేవంత్‌కు KCR భయం పట్టుకుందని BRS MLA హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. KCRకు, రేవంత్‌‌కు చాలా తేడా ఉందని అన్నారు. మహబూబ్‌నగర్‌లో కురుమూర్తిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 15లోపు సంపూర్ణ రుణమాఫీ చేసి ఉంటే తాను రాజీనామా చేసేవాడినని అన్నారు. 42లక్షల మందికి అని చెప్పి కేవలం 22లక్షల మంది రైతులకే మాఫీ చేసి, పైగా తనను రాజీనామా చేయమంటున్నారని చెప్పుకొచ్చారు.

Similar News

News November 20, 2024

జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’

image

విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా టైటిల్‌కి తగ్గట్టుగానే సంక్రాంతికి రానుంది. వచ్చే ఏడాది జనవరి 14న ఈ మూవీని విడుదల చేస్తామని ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎఫ్2, ఎఫ్3 తర్వాత వెంకీ-అనిల్ కాంబోలో ఇది మూడవ సినిమా కావడం విశేషం.

News November 20, 2024

EXIT POLLS: మహారాష్ట్రలో బీజేపీ కూటమికే అధికారం

image

మహారాష్ట్రలో మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతృత్వంలోని ఈ కూటమికి 175-196 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్, NCP SP, SS UBT నాయకత్వంలోని MVAకు 85-112 సీట్లు వస్తాయని పేర్కొంది. BJPకి 113, శివసేనకు 52, NCPకి 17 సీట్లు సొంతంగా వస్తాయంది. కాంగ్రెస్ 35, శరద్ పవార్ పార్టీకి 35, ఉద్ధవ్ సేనకు 27 సీట్లు వస్తాయని తెలిపింది.

News November 20, 2024

ఒలింపిక్స్ భారత్‌లో ఎక్కడ జరగొచ్చు?

image

2036 Olympicsకు అతిథ్య‌మిచ్చే అవకాశం భార‌త్‌కు ద‌క్కితే విశ్వక్రీడల నిర్వహణకు అహ్మ‌దాబాద్‌, ముంబైని సముచిత నగరాలుగా భావించారు. అయితే ఢిల్లీ-NCR, ఆగ్రా న‌గ‌రాలు స‌రైన ఎంపిక‌ని పలువురు విశ్లేషిస్తున్నారు. దేశానికి ఢిల్లీ టూరిస్ట్ గేట్ వేగా ఉండ‌డం, ఢిల్లీ-NCR, ఆగ్రా మ‌ధ్య క‌నెక్టివిటీ పెర‌గ‌డం, నిర్మాణాల కోసం భూమి ఉండ‌డం, తాజ్ మ‌హల్ క్రీడ‌ల ఆతిథ్యానికి థీం సెట్ చేయ‌గ‌ల‌వని చెబుతున్నారు.