News November 20, 2024
నెల్లూరులో వైసీపీ నేతల కీలక సమావేశం

నెల్లూరులో వైసీపీ నేతల కీలక సమావేశం జరుగుతోంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి విక్రమ్ రెడ్డి, ఖలీల్, ఆనం అరుణమ్మ, విజయకుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. పార్టీ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.
Similar News
News April 18, 2026
పెంచలకోన వార్షిక బ్రహ్మోత్సవాలు వివరాలు ఇవే…

రాపూరు మండలం పెంచలకోన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
28: ధ్వజారోహణం, శేష వాహ సేవ
29: బంగారు హనుమంత సేవ
30: బంగారు గరుడసేవ
1: కళ్యాణోత్సవం, రథోత్సవం
2: వసంతోత్సవం, అశ్వవాహన సేవ
3: గోనుపల్లిలో గ్రామోత్సవం, పల్లకి సేవ
భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.
News April 18, 2026
పొదలకూరు: బస్తా రూ.12 వేలు

పొదలకూరు ప్రాంతంలో నిమ్మకాయల ధరలు రికార్డ్ స్థాయికి చేరుకోవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రస్తుతం 80 కిలోల బస్తా ధర రూ.10,500 నుంచి రూ.12 వేలు వరకు పలుకుతుండగా, సమీప రోజుల్లో ఇది రూ.15,000 చేరే అవకాశముందని వ్యాపారులు, రైతులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌లో డిమాండ్ పెరగడం, సరఫరా పరిమితం కావడం వల్ల ధరలు భారీగా పెరిగాయి. రోజుకు 10 నుంచి 15 లారీల వరకు లక్నో, ఢిల్లీ, చెన్నై తరలి పోతున్నాయి.
News April 18, 2026
నెల్లూరు: విషాదం.. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

లింగసముద్రం (M)లో విషాద ఘటన చోటుచేసుకుంది. జంపాలవారిపాలానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి గడ్డం వినయ్ బాబు స్నేహితులతో కలిసి జంగారెడ్డిపాలెం సమీపంలోని చెక్‌డ్యాం వద్ద ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI రాంబాబు దర్యాప్తు చేపట్టారు. శనివారం మృతదేహాన్ని చెక్‌డ్యాం నుంచి వెలికి తీసి పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.


