News November 20, 2024
అవినాశ్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడంలేదు: షర్మిల

AP: తనతో పాటు విజయమ్మ, సునీతపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టించింది YCP MP అవినాశ్ రెడ్డేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారని APCC చీఫ్ షర్మిల అన్నారు. అలాంటప్పుడు ఆయనను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. వర్రా రవీందర్ రెడ్డి కేసులో అవినాశ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అసభ్యకర పోస్టులకు సజ్జల భార్గవ్ రెడ్డే ప్రధాన కారకుడని ఆరోపించారు. ఆయననూ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.
Similar News
News September 19, 2025
నక్సలైట్లూ మన అన్నదమ్ములే కదా: రేవంత్

TG: నక్సలైట్ల ఏరివేతకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌పై CM రేవంత్ స్పందించారు. ‘నక్సలైట్లు లొంగిపోవడానికి గత ప్రభుత్వాలు కొన్ని పాలసీలు తీసుకొచ్చాయి. వారికి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అవకాశముంది. టెర్రరిస్టులతో చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పుడు నక్సలైట్లతో చర్చించడంలో ఇబ్బంది ఏంటి? వాళ్లు కూడా మన అన్నదమ్ములే కదా? నక్సలైట్ల లొంగుబాటు విషయంలో కేంద్రం దయ చూపాలి’ అని వ్యాఖ్యానించారు.
News September 19, 2025
గతేడాదితో పోలిస్తే భూగర్భ జలాలు పెరిగాయి: సీఎం చంద్రబాబు

AP: నియోజకవర్గాల్లో జలాశయాలు నింపుకొని, ఎక్కడికక్కడ భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన బాధ్యత MLAలపై ఉందని CM చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ‘వర్షాకాలం తర్వాత 3మీటర్ల మేర భూగర్భ జలాలు ఉండేలా చూడాలి. ఈ ఏడాది 2.1% వర్షపాతం తక్కువగా ఉంది. గతేడాది 18% అధిక వర్షపాతం నమోదైంది. గతేడాదితో పోలిస్తే 1.25మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. నీటిని సమర్థంగా నిర్వహిస్తే కరవు అనే మాట రాదు’ అని తెలిపారు.
News September 19, 2025
కేసీఆర్‌కు ఉసురు తాకి కూతురు దూరమైంది: రేవంత్ రెడ్డి

TG: ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమం పేరుతో ఆయన ఎంతో మంది యువతను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆ ఉసురు తాకి కూతురు(కవిత) దూరమైందని వ్యాఖ్యానించారు. గతంలో తననూ కూతురి పెళ్లికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు.